Thu Feb 19 2026 12:32:29 GMT+0530 (India Standard Time)
Gold Price Today : మరింత దిగిరానున్న బంగారం ధరలు.. వెండి కూడా అందుబాటులోకి
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి

బంగారం ధరలు మరింత దిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకూ భయపెట్టిన బంగారం నేడు తనంతట తానే దిగి వస్తూ వినియోగదారులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క ఫిబ్రవరి నెలలోనే పదిహేను వేల రూపాయల వరకూ పది గ్రాముల బంగారం ధర తగ్గింది. రానున్న కాలంలో మరింతగా ధరలు తగ్గే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు దిగువకు చేరే అవకాశాలు కూడా లేకపోలేదన్న అంచనాలున్నాయి. పెళ్లిళ్ల సీజన్ లో బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి నిజంగా ఇది తీపికబురు అని చెప్పాలి. దాదాపు పన్నెండు నెలల పాటు ధరలు పెరిగిన బంగారం ధరలు దిగి వస్తున్నాయి.
భారీగా పతనమయి...
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పతనం దిశగా పయనమవుతున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే బంగారం కొనుగోళ్లు మళ్లీ ఊపందుకుంటాయని అంటున్నారు. ఇప్పటికే గతంతో పోలిస్తే బంగారం, వెండి కొనుగోళ్లు కొంత మేర ఎక్కువగానే జరుగుతున్నాయి. అవి మరింతగా పెరిగే అవకాశముందని, జ్యుయలరీ దుకాణాల యజమానులు కొత్త కొత్త డిజైన్ల కోసం ఆర్డర్ ఇస్తున్నారు. అనేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు, పెరుగుతున్న ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, ట్రంప్ నిర్ణయాలు వెరసి బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
నేడు స్థిరంగానే...
బంగారం, వెండి పై పెట్టుబడి పెట్టిన వారు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. దీంతో అయిన కాడికి వస్తుందిలే అనుకుని తాము పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. సురక్షితమైనది భావించి బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టామని అయితే అది తమకు నష్టాలను మిగిల్చిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,41,340 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,54,190 రూపాయల వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,59,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

