Mon Mar 30 2026 10:45:43 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : పది రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గుతాయా?
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి

బంగారం ధరలు మరింత ప్రియమవుతాయని అంటున్నారు. అలాగే వెండి ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయని చెబుతున్నారు. కానీ అవి అంచనాలు మాత్రమే. కానీ రానున్న పది రోజుల్లో పది గ్రాముల బంగారం ధర లక్షా పది వేల రూపాయలకు చేరుకుంటుందని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. దీంతో బంగారం, వెండి ధరలు పెరగక ముందే కొనుగోలు చేయాలా? లేకపోతే తగ్గుతాయని వెయిట్ చేయాలా? అని కొనుగోలు దారులు తర్జనభర్జన పడుతున్నారు. గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు తగ్గుతుండటంతో ఇంకా తగ్గుతాయని ఎదురు చూసే వారు ఎక్కువగా ఉన్నారు.
వెయిట్ చేస్తున్నవారే...
బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అంచనాలు వేయడం కష్టం. పశ్చిమాసియాలో యుద్ధం మొదలయి నెల రోజులు దాటుతున్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం అనుకున్నంత భారీగా పెరగడం లేదు. ఆ ఒక్కటీ చాలదూ అన్నట్లు కొందరు బంగారం కొనుగోలు చేస్తున్నారు. మరొకవైపు అంతర్జాతీయంగా ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ సుంకాలు వంటి కారణాలతో బంగారం, వెండి ధరలపై ప్రభావం పడే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి.
నేటి ధరలు ఇవీ...
పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో కొనుగోళ్లు కూడా ఇటీవల కాలంలో పెరిగాయి. అదే సమయంలో మదుపు దారులు మాత్రం బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టేందుకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు మాత్రమే తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,35,740 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,48,080 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,49,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

