Sun Mar 15 2026 10:56:08 GMT+0530 (India Standard Time)
Gold Price Today : పరాభవనామ ఉగాదికి పసిడి ధరలు మరింత పడిపోనున్నాయా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది.

బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. అయితే ఎంత వరకూ ధరలు పతనమవుతాయన్నది చెప్పలేకపోయినా చాలా వరకూ బంగారం, వెండి ధరలు మధ్యతరగతి ప్రజలకు, వేతన జీవులకు అందుబాటులోకి వచ్చే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే అందరూ ఊహించినట్లుగా భారీగా పతనం మాత్రం బంగారం, వెండి విషయంలో జరగదని, అందుకే కొనుగోలు చేయాల్సిన వారు ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ధరలు తగ్గుతుండటం కొంత కొనుగోలుదారులకు ఊరట లభించినట్లయింది.
యుద్ధం రెండు వారాలుగా...
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం రెండు వారాలుగా కొనసాగుతున్నప్పటికీ ధరలు పెరగకపోవడం ఒకరకంగా ఆనందమే. అయితే ధరలు మరింతగా తగ్గితే కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తున్నారు. మరొకవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కావడంతో శుభకార్యానికి అవసరమైన బంగారం, వెండి కొనుగోలుకు కొందరు మాత్రం తప్పని సరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం జ్యుయలరీ దుకాణాలు కస్టమర్లలో కళకళలాడుతున్నాయి. అయితే ధరలు మరింతగా తగ్గితే మాత్రం అమ్మకాలు మరింతగా పెరుగుతాయని వ్యాపారులు భావిస్తున్నారు.
నేటి ధరలు...
మరొకవైపు బంగారం, వెండిపై మదుపు చేసే వారు మాత్రం ప్రస్తుతం కరువయ్యారు. గతంలో బంగారం, వెండిపై ఎక్కువగా పెట్టుబడి పెట్టేవారు నేడు దానిపై మదుపు చేస్తే సురక్షితం కాదని వెనకడగు వేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధరపై పది వేల రూపాయలు తగ్గింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,46,350 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,59,660 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,80,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

