Sun Apr 05 2026 16:48:31 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : బంగారాన్ని కొనుగోలు చేయడానికి సరైన టైం ఇదేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగానే ఉన్నాయి

బంగారం, వెండి ధరలు ఎంత పెరుగుతాయని అనుకుంటున్నారు? ఎంత తగ్గుతాయనుకుంటున్నారు? ఇప్పుడు ప్రతి గోల్డ్ లవర్ లో మెలిగే సందేహాలివి. బంగారం ధరలను అదుపు చేయడం కష్టం. వాటి ధరల్లో మార్పు ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఎందుకంటే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో పాటు విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో రూపాయి తగ్గుదల, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం, ట్రంప్ ఇప్పటికే అనేక దేశాలపై విధించిన సుంకాల వంటి వాటితో ధరల ప్రభావం ఉండవచ్చు.
తగ్గినప్పుడు కొనుగోలు చేయాలని...
బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయాలని కొందరు, ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని మరికొందరు ఎవరికి వారు తమకు తోచినట్లుగా చెబుతున్నారు. కానీ మార్కెట్ నిపుణులు మాత్రం భవిష్యత్ లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనాలు వేస్తున్నారు. బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టేవారు మదుపు చేసి ఒక ఏడాది పాటు వాటి వైపు చూడకుండా ఉంటే అత్యధిక లాభాలు వస్తాయని అంటున్నారు. అయితే ఇంకా ధరలు తగ్గితే పెట్టుబడులు పెట్టాలని చాలా మంది చూస్తున్నారు.
యాభై వేలు తగ్గి...
మరొకవైపు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ధరలు అమాంతం పెరుగుతాయన్న అంచనాలతో తమకు అవసరమైనంత మేరకు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగానే ఉన్నాయి. ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,38,350 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,50,930 రూపాయలుగా కొనసాగుతుంది. రెండు లక్షలకు చేరుకుని ఇప్పటికే యాభై వేలు తగ్గింది. ఇక వెండి కిలో ధర 2,55,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

