Sat Mar 07 2026 16:34:07 GMT+0530 (India Standard Time)
Gold Price Today : కలవరమాయె మదిలో.. కనకం ధరలు అందనంత దూరంలో
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి

బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి. కనకం ప్రియులను కలవరపరుస్తున్నాయి. అయితే కొన్నిరోజులు బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఎక్కువ రోజులు ధరలు పెరుగుతున్నాయి. పెరిగిన సమయంలో ధరలు ఎక్కువగా పెరగడం, తగ్గిన సమయంలో తక్కువగా ధరలు పెరగడం బంగారం విషయంలోనే సాధ్యమవుతుంది. తగ్గినప్పుడు పది రూపాయలు తగ్గడం, పెరిగినప్పుడు వందలు, వేల రూపాయలు పెరగడం మామూలు అయింది. అయితే అనేక కారణాలతో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో లేవన్నది వాస్తవం. పెరిగిన ధరలతో పాటు జీఎస్టీ, జ్యుయలరీ దుకాణాలు వేసే తరుగు, మిగిలిన అదనపు మొత్తంతో కలిపి ధరలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అనేక పన్నులతో...
ఈ కారణంగానే దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా బంగారం, వెండి ధరలు ఉంటున్నాయి. భారత్ కు బంగారం దిగుమతులు తక్కువగా ఉండటం, డిమాండ్ ఎక్కువ కావడం కూడా ధరలు పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తోరూపాయి తగ్గుదల, డాలర్ బలపడటం వంటి కారాణాలతో బంగారం, వెండి ధరల్లో మార్పునకు కారణమని అంటున్నారు. అయితే రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాల్లో మార్కెట్ నిపుణులున్నారు. అందుకే ధరలు అందుబాటులోకి రాకపోయినా, ఇప్పుడు తగ్గుతున్నందున కొనుగోలు చేయడం మంచిదని బిజినెస్ ఎక్స్ పెర్ట్స్ సూచిస్తున్నారు.
ధరలు తగ్గినా...
పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతుండటంతో కొనుగోళ్లు అంతగా జరగకపోవడంతో వ్యాపారస్థులు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే ధరలు తగ్గుతాయని పెట్టుబడి పెట్టే వారు కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,13,340 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,23,650 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,69,900 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు.
Next Story

