Sun Dec 14 2025 00:24:36 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prcie Today : పసిడి ధరలు అందుబాటులోకి రానున్నాయా? మీకోసం తీపికబురు
నేడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపిస్తుంది

బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న హెచ్చరికలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ధరలు పెరుగుతూనే ఉంటాయి. అదుపులో పెట్టడం కూడా కష్టమే. ఎందుకంటే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. డిమాండ్ తగ్గినప్పటికీ ధరలు పెద్దగా తగ్గవు. అందుకే బంగారం ధరలు తగ్గాలంటే సీజన్ కు, డిమాండ్ కు సంబంధం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ట్రంప్ నిర్ణయాలు, ట్రంప్ విధించిన అదనపు సుంకాలు, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.
తగ్గినప్పుడే కొనుగోలు చేయాలనుకుంటే...
బంగారం ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలని భావిస్తే అది కుదిరే పని కాదని గత కొద్ది రోజులుగా స్పష్టమవుతూనే ఉంది. వేచి చూసే కొద్దీ ధరలు ఇంకా పెరుగుతూనే ఉంటున్నాయి. అందుకే బంగారాన్ని తాము కొనుగోలు చేయాలని భావించినప్పుడు కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బంగారం ధరలు ఎప్పటికీ భారీగా పతనం కావన్నది వాస్తవం. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా గోల్డ్ హిస్టరీ చూస్తున్న వారికి ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అందుకే బంగారం ఇప్పుడు కొనుగోలు చేసి పెట్టుకుంటే భవిష్యత్ లో అది పెట్టుబడిగా మారుతుందని భావించి, కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.
స్వల్పంగా పెరిగి...
ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తుండటంతో బంగారం, వెండి ధరలు మరింత ప్రియమవుతాయన్న అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వెండి ధరలు ఇప్పటికే ఎవరికీ అందుబాటులో లేకుండా పోయాయి. నేడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపిస్తుంది. కిలో వెండి ధర పై వంద రూపాయలు పెరిగింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,15,360 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,25,850 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,70,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు జరగవచ్చు.
Next Story

