Sun Apr 12 2026 10:47:46 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : గోల్డ్ లవర్స్ కు షాక్.. దూసుకుపోతున్న బంగారం
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది.

బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు నిజమయ్యేటట్లే కనిపిస్తుంది. అమెరికా - ఇరాన్ ల మధ్య ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కావడంతో పాటు రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం కుదరడంతో బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బంగారం ధరలు యుద్ధం జరిగినంత సేపు తగ్గి తర్వాత పెరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వీటి ధరలు ఎక్కడి వరకూ వెళతాయన్నది మాత్రం మార్కెట్ నిపుణులు సయితం అంచనా వేయలేకపోతున్నారు.ధరలు మాత్రం మరింగా పెరిగే అవకాశముందని అంచనాలు వినపడుతున్నాయి.
భారత్ లో ఎక్కువగా...
భారత్ లో బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాల మేరకు బంగారం, వెండిని ఎక్కువ మంది ఇష్టపడతారు. శుభకార్యాలకు తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. గతంలో చిన్న విషయాలకు కూడా బంగారాన్ని సొంతం చేసుకోవడానికి ఇష్టపడే భారతీయులు పెరిగిన ధరలతో మాత్రం కొంత కొనడం తగ్గించారు. 2025లో పది గ్రాముల బంగారం ధర ఒక్కసారిగా పెరగడంతో దాని అమ్మకాలపై కూడా ప్రభావం చూపింది. అలాగే వెండి ధరలు కూడా మూడు లక్షలు కిలో దాటడంతో కొనుగోలుకు ఆసక్తి చూపకపోవడం విశేషం.
ఈరోజు ధరలు ఇలా...
మరొకవైపు పెళ్లిళ్లసీజన్ నడుస్తుండటంతో పాటు పెట్టుబడి పెట్టే వారు కూడా తిరిగి బంగారం, వెండిపై మదుపు చేయడం ప్రారంభిస్తుండటంతో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,40,100 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,52,840 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 2,65,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

