Thu Apr 02 2026 11:24:06 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు..కొనడం మంచిదేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది

బంగారం ధరలు మరింత పెరగనున్నాయా? తగ్గనున్నాయా? తగ్గితే ఎంత మేరకు తగ్గుతాయి? ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదేనా? మరికొంత కాలం వేచి చూడటం మేలా? అన్న మీమాంసలో అనేక మంది వినియోగదారులున్నారు. బంగారం వెండి ధరలు ఒకరోజు పెరుగుతూ, మరొకరోజు తగ్గుతూ కొనుగోలుదారులను తికమకకు గురి చేస్తున్నాయి. అయితే అవసరం ఉన్న వారు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అంతే తప్ప బంగారంపై పెట్టుబడి పెట్టేవారు, తమ వద్ద ఉన్న డబ్బులతో బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేసేవారు కొంత వెనక్కు తగ్గుతున్నారు.
యుద్ధం ప్రభావంతో...
బంగారం అంటే అందరికీ ఇష్టమే. అందులోనూ మహిళలు అత్యంత ఇష్టపడే బంగారం ధరల్లో స్థిరత్వంగా లేకుండా కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయి. యుద్ధం ఎంత కాలం జరిగితే బంగారం అంత తగ్గుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. లక్ష రూపాయలకు చేరుకుంటుందని కొందరు చెబుతున్నారు. కానీ అంత స్థాయిలో ధరలు తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు. మరొకవైపు పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బంగారం, వెండి ఆభరణాల విక్రయాలు ఊపందుకున్నాయి.
నేటి ధరలు...
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల తికమక పెడుతున్నాయి. నిన్నటి వరకూ తగ్గిన బంగారం, వెండి ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,40,210 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,52,960 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 2,65,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.
Next Story

