Sun Mar 01 2026 11:05:43 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : భగ్గుమన్నబంగారం ధరలు.. మండి పోతున్న వెండి ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది

బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఒకటి కాదు.. రెండు కాదు..వేలల్లో పెరిగి వినియోగదారులకు షాక్ కు గురిచేశాయి. వెండి ధరలు కూడా అంతే. ఇక కొనుగోలు చేయడం ఈ సీజన్ లో కష్టమేనని అంటున్నారు. గత కొంతకాలం నుంచి తగ్గుతూ, స్థిరంగా నెమ్మదిగా బంగారం, వెండి ధరలు ఉండటంతో మరింతగా ధరలు పతనమవుతాయని భావించారు. కానీ అనుకోకుండా ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి.వెండి ధరలు మండిపోతున్నాయి. ధరలు మరింతగా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందులో ఇక ఇప్పటికే వెండి కిలో ధర మూడు లక్షల రూపాయలు దాటేసింది.
గల్ఫ్ యుద్ధంతో...
గల్ఫ్ యుద్ధంతో మళ్లీ బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. అలా యుద్ధం మొదలయిన వెంటనే ఇలా ధరలు పరుగును ప్రారంభించాయి. కిలో వెండి ధర అయితే ఇరవై ఐదు వేల రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ ధరల్లో పెరుగుతున్న ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాల కారణంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంకా కొంత కాలం ధరలు పెరుగుతూనే ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పట్లో బంగారం, వెండి ధరలు ఇక తగ్గవని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి జ్యుయలరీ దుకాణాలు వెలవెలబోతున్నాయి.
భారీగా పెరిగి...
పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, వెండి కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారులు ధరలను చూసి షాకవుతున్నారు. తాము కొనాల్సిన బంగారం, వెండి కంటే తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి వెళుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఒక్కరోజులోనే పది గ్రాముల బంగారం ధరపై ఏడు వేల రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై ఇరవై ఐదు వేల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,54,630 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,68,710 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 3,20,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

