Tue Feb 10 2026 14:24:59 GMT+0530 (India Standard Time)
Gold Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి సూచనలివే
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లోనూ స్వల్ప పెరుగుదల కనిపించింది.

బంగారం అంటే మక్కువ ఎవరికి లేదు. అందరూ పసిడిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. బంగారం, వెండి వస్తువులు తమ ఇంట్లో ఎన్ని ఉంటే అంత మంచిదని నమ్ముతారు. అందుకే సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి భారతీయులు ఎక్కువ మంది బంగారం, వెండి కొనుగోలుపై ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పుట్టిన రోజున నుంచి పెళ్లిళ్ల వరకూ ఏ శుభకార్యం జరిగినప్పటికీ బంగారం కొనుగోలు చేయడం మొన్నటి వరకూ ఒక అలవటుగా మార్చుకున్నారు. కానీ గత ఏడాది నుంచి ఆ ఇష్టాన్ని అయిష్టంగా మార్చుకున్నారు. ధరలు విపరీతంగా పెరగడంతో బంగారం, వెండి కొనుగోలు విషయంలో మాత్రం చాలా మంది ఆసక్తి చూపడం లేదు.
మరింత పెరుగుతాయని...
గత కొన్నాళ్ల నుంచి బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపించాయి. అందుకే అప్పులు చేసి మరీ కొందరు బంగారం, వెండి పై మదుపు చేశారు. కొందరు క్రెడిట్ కార్డులను ఉపయోగించి మరీ బంగారం, వెండి కొనుగోలు చేశారు. కానీ బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యే సరికి తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని లబోదిబోమంటున్నారు. బంగారం అంటే భారంగా మారుతుందనుకుంటున్న సమయంలో ధరలు కొంత దిగి రావడం, పెళ్లిళ్ల సీజన్ సమయం దగ్గర పడుతున్న వేళ ధరలు కొంత అందుబాటులోకి రావడంతో వివాహాది శుభకార్యాల కోసం బంగారం, వెండిని కొందరు కొనుగోలు చేశారు. కానీ పెట్టుబడి పెట్టిన వారు మాత్రం నష్టపోయారు.
నేటి ధరలు ఇలా...
పెళ్లిళ్ల సీజన్ ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీంతో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడే కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లోనూ స్వల్ప పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరలు 1,44,760 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,57,920 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 3,00,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.
Next Story

