Thu Feb 12 2026 05:29:19 GMT+0530 (India Standard Time)
Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం.. దూసుకుపోతున్న వెండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది

బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. వెండి ధరలు కూడా ఊహించని రీతిలో ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో నాలుగు లక్షలు దాటేసిన కిలో వెండి ఇప్పుడు కిలో కేవలం 3.20 లక్షలకు చేరుకుంది. పది గ్రాముల బంగారం ధరలు కూడా రెండు లక్షలకు చేరుకుని చివరకు నలభై శాతం వరకూ పడిపోయాయి. భారీగా బంగారం, వెండి ధరలు పతనం కావడంతో ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోయారు. అప్పులు తెచ్చి మరీ బంగారం, వెండి పై పెట్టుబడి పెట్టిన వారు నేడు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు మాత్రం తమ వద్ద ఉన్న బంగారం, వెండి నిల్వలలను విక్రయించి లబ్దిపొందారు.
బంగారం కొనుగోలుకు...
బంగారం అంటే అందరికీ మక్కువ ఉంటుంది. అందులోనూ మహిళలకు ఎక్కువ ఇష్టం. పసిడి అంటే చాలా మంది కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. ఇటీవల కాలంలో మహిళలు, పురుషులు అనే బేధం లేకుండా, జనరేషన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేసే వారు ఎక్కువగా కనపడుతున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా ఎక్కువ మంది బంగారం, వెండి అంటే సురక్షితమైన పెట్టుబడి అని భావించి దాని మీద పెట్టారు. కానీ ఇంతగా ధరలు పెరిగి ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో ఈ మార్కెట్ కూడా సురక్షితం కాదని తేలిపోయింది. అయితే దీర్ఘకాలం వేచి చూస్తే కొంత లాభాలు ఖచ్చితంగా వస్తాయని, బంగారం, వెండి నష్టం ఎప్పుడూ నష్టం తెచ్చిపెట్టదని మార్కెట్ నిపుణుల అభిప్రాయం.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో...
ఇక మాఘమాసం ప్రారంభమయింది. పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలయింది. శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుండటంతో బంగారం, వెండికి మరింత డిమాండ్ పెరుగుతుందని అంచనాలు వినపడుతున్నాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. కిలో వెండి పై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,46,160 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ంల పది గ్రాముల బంగారం ధర 1,59,450 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 3,20,100 రూపాయలకు చేరింది. మధ్యాహ్నానికి ధరల్లో మరింత మార్పు ఉండవచ్చు.
Next Story

