Thu Jan 29 2026 05:27:46 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : భారీ షాకిచ్చిన బంగారం.. పరుగులు పెడుతున్న వెండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది.

బంగారం ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా దానితో పోటీ పడుతున్నాయి. అయితే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాత్రం జ్యుయలరీ దుకాణాల్లో కొనుగోళ్లు మాత్రం ఉండటం లేదు. బంగారం మార్కెట్ నిస్తేజంగా మారింది. ఒకరకంగా చెప్పాలంటే గోల్డెన్ డేస్ పోయాయంటూ పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. గత ఏడాది జనవరి నుంచి ప్రారంభమయిన ధరల పెరుగుదల నేటి వరకూ కొనసాగుతుండటంతో ఇక బంగారం కొనే ఆలోచన కూడా చేయడం లేదు. కానీ కొనుగోళ్లతో సంబంధం లేకుండా ధరలు పెరుగుతున్నాయి. వినియోగదారులు కొనకపోయినా డిమాండ్ లేకపోయినప్పటికీ బంగారం ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి.
గతంలో మాదిరిగా...
గతంలో బంగారం ధరలు అందుబాటులో ఉండేవి. అందుకే బంగారాన్ని ప్రతి చిన్న కార్యక్రమంలో చోటు ఉండేలా అందరూ చూసేవారు. కానీ నేడు పెళ్లిళ్లలోనూ పసిడి సందడి కనిపించడం మానేసింది. బంగారం పెట్టేకంటే కట్నకానుకలు ఇవ్వడమే మంచిదన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతుంది. అందులో బంగారం, వెండి అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా మారింది. సంప్రదాయం నుంచి వచ్చిన ఆచారాలను కూడా పక్కన పెట్టేసి బంగారం, వెండి లేకుండానే శుభకార్యాలు జరుపుకునే పరిస్థితికి వచ్చారు. బంగారం, వెండి వస్తువుల ధరలు పెరగడానికి అంతర్జాతీయ పరిణామాలతో పాటు విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఇక రానున్న కాలంలో...
ఇక రానున్న కాలంలో బంగారం ధరలు భారీగా పతనమవుతాయన్న ప్రచారంతో చాలా మంది పెట్టుబడి పెట్టేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలకు చేరువలో ఉంది. కిలో వెండి ధర నాలుగు లక్షల రూపాయలకు దగ్గరగా ఉంది. ఈరోజు ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,56,950 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,69,500 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 3,77,600 రూపాయలకు చేరుకుంది. మధ్యాహ్నానికి మరింతగా ధరలు పెరుగుతాయన్న ఆందోళన వినియోగదారుల్లో ఉంది.
Next Story

