Thu Mar 26 2026 10:59:25 GMT+0530 (India Standard Time)
Gold Price Today : బ్యాడ్ లక్.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది

బంగారం ధరలు తగ్గాయని సంతోషించే లోపు మళ్లీ పరుగు అందుకున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో ధరలు తగ్గిన బంగారం, వెండి మళ్లీ పెరుగుతున్నాయి. బంగారం అంటే అందరికీ ఇష్టమే. పండగలు, పుట్టిన రోజులు, శుభకార్యాలు, పెళ్లిళ్లకు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం భారతీయ సంప్రదాయంలో భాగంగా మారింది. నిన్న మొన్నటి వరకూ ధరలు పెరగడంతో బంగారం, వెండి వైపు చూడని వారు ఇటీవల ధరలు తగ్గుముఖం పడుతుండటంతో కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతున్నారు.
బంగారం అంటే...
బంగారం అంటే అందరికీ ఇష్టమే.దానిని సొంతం చేసుకుందామని చాలా మంది భావిస్తారు. అందులో భాగంగా తాము కూడబెట్టిన మొత్తాన్ని ఎక్కువగా బంగారం,భూమిపైనే పెట్టుబడి పెట్టేవారు అధికంగా ఉన్నారు. బంగారం కొనుగోలు చేసే వారిలో పేద పెద్ద అనే తారతమ్యం ఉండదు. ఎవరికి తాహతుకు తగ్గట్లు వారు కొనుగోలు చేస్తారు. అందుకే భారతదేశంలో బంగారం, వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. గత ఏడాది నుంచి అధికంగా ధరలు ఉండటంతో బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తిచూపడం లేదు.
పెట్టుబడి పెట్టిన వారు...
పెట్టుబడి పెట్టిన వారు కూడా తాము మదుపు చేసిన మొత్తాలను వెనక్కు తీసుకోవడంతో నిన్నటి వరకూ బంగారం, వెండి ఆభరణాల ధరలు తగ్గుముఖం పట్టాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధర 3,500 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై పదిహేను వేల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,34,460 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,46,680 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2,60,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు పెరగవచ్చు.
Next Story

