Wed Jan 28 2026 06:12:02 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : గుడ్ న్యూస్.. బంగారం ధరలు కొంత దిగి వచ్చాయి.. కానీ కొనేటంత మాత్రం?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో మాత్రం పెరుగుదల కనిపించింది.

బంగారం ధరలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ కమోడిటీస్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ప్రైస్ దాదాపు 2 శాతం పెరిగింది. మరోపక్క క్రూడ్ ఆయిల్ ధరలు ఒకింత తగ్గాయి. గత వారాంతం ట్రంప్ గ్రీన్ ల్యాండ్ విషయంలో సైనికచర్యను తోసిపుచ్చడం, బోర్డు అఫ్ పీస్ అంటూ శాంతిమంత్రాన్ని పఠించడంతో ఒకింత బంగారం శాంతిస్తుందనే సంకేతాలు కనపడ్డప్పటికీ...మధ్యప్రాచ్యంలో అమెరికా బలగాల మోహరింపు, ఇరాన్ కూడా అదే రీతిలో కౌంటర్ ఇవ్వడం, అతికీలకమైన హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ బలమైన పట్టు నేపథ్యంలో అనిశ్చితి అలానే కొనసాగుతుంది. అమెరికన్ నౌకలు ఇరాన్ ని సమీపించడం, ఇజ్రాయెల్ ప్రకటనలు, దానికి ఇరాన్ కౌంటర్లు వెరసి బంగారం ధర అల్ టైమ్ హై కి చేరుకుంది.
పెట్టుబడులు పెట్టేవారు...
ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం అలాగే వెండిపైన పెడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ రెండు కూడా సేఫ్ హెవెన్ పెట్టుబడులుగా ఉండటం. ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు వస్తున్న కారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈ రెండు లోహాలలో పెట్టేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనికి తోడు అమెరికన్ డాలర్ విలువ పతనం అవడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. మరోవైపు సెంట్రల్ బ్యాంకులు కూడా విపరీతంగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. అందులో చైనా, బ్రెజిల్ ప్రధానంగా ఉన్నాయని చెప్పవచ్చు. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లలో కూడా బంగారం ఆభరణాల ధరలు భారీగా పెరుగుతున్నాయి. సెక్యూర్డ్ అసెట్స్ గా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మరికొంత కాలం ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
రానున్న రోజుల్లో...
మరొక వైపు రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి. పది గ్రాముల బంగారం ధర ఇప్పటికే లక్షన్నరకు చేరుకున్నాయి. వెండి ధరలు మూడు లక్షలు దాటేశాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,48,440 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,61,940 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 3.87,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

