Sun Dec 14 2025 00:24:33 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rates Today : బంగారాన్ని కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసం?
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్నిరోజుల పాటు తగ్గినట్లే తగ్గి మళ్లీ పరుగు అందుకున్నాయి.

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్నిరోజుల పాటు తగ్గినట్లే తగ్గి మళ్లీ పరుగు అందుకున్నాయి. ఇటీవల కాలంలో వరసగా బంగారం ధరలు తగ్గడం చూసి ధరలు మరింత పతనమవుతాయని అనేకమంది అంచనా వేశారు. అందుకే ఇంకాధరలు తగ్గుతాయేమోనని కొనుగోలు చేయకుండా వేచి చూస్తున్నారు. కానీ అదే సమయంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చేస్తున్న సూచనలు పట్టించుకోవడం లేదు. ధరలు మరింత పతనమయితే తమకు అందుబాటులోకి ధరలు వస్తాయని భావిస్తున్నారు. కానీ ఊహించని విధంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ధరల పెరుగుదల చూసిన తర్వాత నిన్ననే కొనుగోలు చేసినట్లయితే బాగుండేదని చాలా మంది భావిస్తున్నారు.
సంస్కృతి, సంప్రదాయాలను...
బంగారం అంటే ఒక అపురూపమైన వస్తువు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నమూనాగా ఉంటుంది. భారతీయులలో బంగారానికి, సెంటిమెంట్ కు అనుబంధం ఉంది. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా ముందుగా కొనుగోలు చేసేది బంగారమే. తర్వాత వెండి. వెండి వస్తువులను కూడా భారతీయులు అలాగే ఆదరిస్తారు. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని నేటి తరం కూడా కొనసాగిస్తుండటంతోనే బంగారం, వెండి వస్తువులకు డిమాండ్ తగ్గలేదు. అయితే ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడంతో తమ శక్తికి మించి అవుతుందని భావించి కొనుగోలుపై వెనక్కు తగ్గారు కానీ లేకుంటే బంగారాన్ని విరివిగా కొనుగోలు చేసేవారు.
నేటి ధరలు...
ఇక బంగారం, వెండి వస్తువులపై పెట్టుబడి పెట్టేవారు కూడా ఇటీవల కాలంలో అధిక మయ్యారు. తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వచ్చేది ఇందులోనే అని భావించి ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా బంగారు బిస్కెట్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,12,150 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,26,380 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,52,190 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరలు పెరగొచ్చు. తగ్గొచ్చు. స్థిరంగా కొనసాగే వీలుంది.
Next Story

