Fri Dec 05 2025 11:32:55 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : బంగారంపై మక్కువ చచ్చిపోయిందా?అయితే ఈ న్యూస్ మీకోసమే
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగుదల కనిపించింది.

దేశంలో బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. వెండి ధరలు కూడా శాంతిస్తున్నాయి. దేశంలో బంగారం, వెండి ధరలు విపరీతంగా ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందారు. ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడంతో కొనుగోలు చేసే ఆలోచనను కూడా విరమించుకున్నారు. పెళ్లిళ్ల కోసం కొద్దో గొప్పో కొనుగోలు చేయడం మినహాయించి బంగారంపై మక్కువ మాత్రం పూర్తిగా చచ్చిపోయిందనే చెప్పాలి. ధరలు ఎక్కువ పెట్టి కొనుగోలు చేయడం అనవసరం అని భావించిన చాలా మంది ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపుతుండటంతో ఈ ఏడాదిలో బంగారం, వెండి కొనుగోళ్లు కూడా భారీగా తగ్గాయి. ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు కూడా వినిపించాయి.
అంచనాలకు భిన్నంగా...
అయితే మార్కెట్ నిపుణుల అంచనాలకు భిన్నంగా గత కొద్ది రోజుల నుంచి ధరలు దిగి వస్తున్నాయి. అయితే ఇందుకు అనేక కారణాలున్నాయని అంటున్నారు. డాలర్ బలోపేతం కావడంతో పాటు అంతర్జాతీయంగా ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు నిలిచిపోవడం వంటి వాటితో బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయి. బంగారం ధరలు మరికొద్ది రోజుల్లోనే పది గ్రాముుల లక్షన్నరకు చేరుకుంటుందని అంచనాలు వినిపించాయి. అలాగే వెండి కిలో ధర రెండు లక్షలు దాటేసిందని, ఇక తగ్గదని భావించారు. కానీ గత కొద్ది రోజులుగా ధరలు తగ్గుతుండటంతో ఇప్పుడు వినియోగదారులు బంగారం వైపు చూసేందుకు మొగ్గు చూపుతున్నారు.
స్వల్పంగా పెరిగి...
పెట్టుబడులు పెట్టే వారు సయితం మొన్నటి వరకూ బంగారంపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. ధరలు మరింత పెరుగుతాయని భావించి బంగారం, వెండి వస్తువులను విరివిగా కొనుగోలు చేశారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగుదల కనిపించింది. వెండి ధరలు రానున్న కాలంలో మరింత పతనమవుతాయని అంచనాలు వినిపిస్తున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,15,140 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,25,610 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,69,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ఈ ధరల్లో మార్పులు రావచ్చు.
Next Story

