Fri Dec 05 2025 09:03:44 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : ఆల్ టైం హైకి చేరుకున్న గోల్డ్.. వెండిని ముట్టుకోగలమా?
బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి

బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. తగ్గుతాయని చెబుతున్న వార్తల్లో నిజం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొంతకాలంగా బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు ఇప్పటికే పది గ్రాముల ధర లక్షా పాతిక వేల రూపాయలకు చేరుకుంది. వెండి ధర దాదాపుగా కిలో రెండు లక్షల రూపాయలకు చేరువగా ఉంది. వెండి అంటే గతంలో కేవలం తమ ఇళ్లలో శుభసూచకంగానే చూసేవారు. కానీ నేడు పాత వెండికి విపరీతమైన డిమాండ్ ఏర్పడిందంటున్నారు. అందుకే వెండి మార్కెట్ మరింత పెరిగే అవకాశముందని, మీ వద్ద పాత వెండి ఉంటే ఇప్పుడే వాటిని విక్రయించవద్దని మంచి ధర మున్ముందు లభిస్తుందని వ్యాపారులు చెబుతున్నారు.
భారీగా పెరుగుతూ...
బంగారం, వెండి ధరలు పైపైకి పెరగడానికి అనేక కారణాలున్నాయి. అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ తో పాటు అమెరికా షట్ డౌన్, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, గత కొద్ది సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధాలు వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం, వెండి వస్తువులపై పెట్టుబడి పెట్టేవారు సురక్షితంగా భావిస్తుండటంతో ఎక్కువగా పెట్టుబడి దారులు కొనుగోలు చేస్తున్నారని, అయితే సాధారణ మార్కెట్ మాత్రం గతంతో పోల్చుకుంటే డల్ గా ఉందని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు.
నేటి ధరలు...
ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాలు సీజన్ నడుస్తుండటంతో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. బంగారం ధర త్వరలోనే లక్షన్నర రూపాయలు దాటుతుందని అంటున్నారు. ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు కూడా పెరిగాయి. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,14,960 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా ఇరవై ఐదు వేల నాలుగు వందల పది రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,97,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మరిన్ని మార్పులుండవచ్చు.
Next Story

