Fri Mar 27 2026 11:18:43 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : కొనాలా? వద్దా? బంగారం ధరల హెచ్చు తగ్గుదలతో మీమాంస
ఈరోజు దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వినియోగదారులను అయోమయంలో పడేస్తున్నాయి. కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయమా? కదా? అని నిర్ణయించుకోకుండా చేస్తున్నాయి. ఒకరోజు ధరలు భారీగా పెరుగుతూ, మరికొన్ని రోజులు భారీగా తగ్గుతుండటంతో కొనుగోలు చేయాలా? వద్దా? అన్న మీ మాంసలో పడ్డారు. ఇంకా తగ్గుతాయని కొందరు అంచనాలు వేసుకుంటుండగా, మళ్లీ ధరలు పెరుగుతాయన్న ప్రచారంతో ఒకింత ఆందోళన కూడా నెలకొంది. అందుకే బంగారం కొనుగోళ్లపై ఈ అనిశ్చితి పడిందని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు.
కొనుగోళ్లలో ప్రతిష్టంభన...
బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గుదలతో కొంత అమ్మకాల్లో ప్రతిష్టంభన ఏర్పడిందని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం పడకుండానే తగ్గడం, కాల్పుల విరమణ అని ట్రంప్ ప్రకటించిన తర్వాత తిరిగి ధరలు పెరగడంతో ఎప్పుడు ధరలు తగ్గుతాయో? లేదో? అన్నది ఎటూ తేలకుండా ఉంది. పెళ్లిళ్ల సీజన్ కు తాము కొనుగోలు చేయాల్సిన బంగారం, వెండి వస్తువులను ఇప్పుడే కొనుగోలు చేయాలా? లేక మరికొంత కాలం వాయిదా వేసుకుంటే మంచిదా? అన్న సలహాల కోసం ఎదురు చూస్తున్నారు.
హెచ్చుతగ్గులుండటంతో...
పెట్టుబడి దారులు కూడా బంగారం, వెండిపై మదుపు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గుదల కారణమని అంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధర భారీగా తగ్గింది. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారంధర పై సుమారు రెండు వేల రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,32,490 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,44,540 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,59,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

