Thu Mar 12 2026 10:45:53 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. నేటి ధరలు ఎంత ఉన్నాయో తెలిస్తే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి

బంగారం ధరలపై యుద్ధం ప్రభావం పెద్దగా చూపడం లేదు. గత పదిరోజులకు పైగానే ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కొనసాగుతుండగా, ఆ ప్రభావం బంగారం, వెండి ధరలపై పడుతుందని అందరూ అంచనా వేశారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా బంగారం, వెండి ధరలు ఇటీవల కాలంలో పెరగలేదు. పెరగకపోగా తగ్గుతున్నాయి. కొన్ని రోజులు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో పాటు డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో రూపాయి తగ్గుదల, ట్రంప్ విధించిన సుంకాలతో బంగారం, వెండి ధరలు నిన్న మొన్నటి వరకూ పెరిగాయి. కానీ నేడు మాత్రం వినియోగదారులకు ఊరట కల్గించేలా ధరలు తగ్గుతూనే ఉన్నాయి.
పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో ...
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో ధరలు పెరుగుదల ఉంటుందని భావించారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ధరలు మాత్రం పెరగడం లేదు. అలాగని ఇంకా బంగారం, వెండి ధరలు అందుబాటులోకి రాలేదు. అంటే ఇంకా ధరలు తగ్గుతాయేమోనని చాలా మంది వేచి చూస్తున్నారు. పెట్టుబడి పెట్టేవారు సయితం బంగారం, వెండిపై మదుపు చేయడం సురక్షితం కాదని భావిస్తున్నారు. దీంతో పెట్టుబడి దారులు కూడా వెనుకంజ వేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొద్దో గొప్పో అమ్మకాలు జరుగుతున్నాయని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఎంత ధరలు పెరిగినా శుభకార్యాలకు, పెళ్లిళ్లకు తప్పనిసరిగా బంగారం, వెండి కొనుగోలు చేయాల్సి వస్తుండటం దీనికి కారణం.
నేటి ధరలు ఇలా...
మరొకవైపు ధరలు ఇంకా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధరలు తగ్గుతున్నాయని కొనుగోలు చేయకుండా ఉంటే రానున్న కాలంలో బంగారం, వెండి కొనలేని పరిస్థితులుంటాయని అంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,49,710 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,63,320 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 2,99,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.
Next Story

