Sat Dec 13 2025 22:39:32 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : ఆలస్యం.. బంగారం .. మరింత భారం.. ఇప్పుడే కొనుగోలు చేయండి
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఎందుకంటే ధరలు రానున్న కాలంలో ధరలు మరింతగా పెరిగే అవకాశముంది. అదే సమయంలో వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు భారీగానే తగ్గాయి. అయితే ఇంకా గతంలో మాదిరిగా అందుబాటులోకి రాకపోయినా ధరలు ఇక తగ్గవని ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ధరలు ఇంకా తగ్గుతాయని వేచి చూడటం వృధా అని చెబుతున్నారు. పెట్టుబడిగా బంగారాన్ని, వెండిని చూసే వారు కూడా ఈ సమయంలో కొనుగోలు చేస్తే ఖచ్చితంగా మంచిల లాభాలు వస్తాయని చెబుతున్నారు.
కొనుగోలుపై ఆసక్తి ఉన్నా...
బంగారం అంటే మహిళలకు పిచ్చి. అలాగే భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా మారిన బంగారం విషయంలో ధరలను గురించి పెద్దగా ఆలోచించరన్న నమ్మకం ఉండేది. కానీ గత ఏడాది నుంచి పెరుగుతున్న బంగారం ధరలను చూసి కొనుగోలు చేయడం మానుకున్నారు. అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. దీంతో జ్యుయలరీ దుకాణాల యజమానులు కూడా అనేక డిస్కౌంట్లు, రాయితీలు ప్రకటించినప్పటికీ బంగారం కొనుగోలు చేసేందుకు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. కానీ గత కొద్ది రోజులుగా క్రమంగా బంగారం, వెండి ధరలు భారీగా దిగివస్తుండటంతో పసిడి ప్రియులతో పాటు అవసరం ఉన్న వారు కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.
ధరలు తగ్గి...
కొత్త ఏడాది ధరలు మరింత పెరుగుతాయని అంచనాలు వినపడుతున్నాయి. అలాగే ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా ఉండటంతో కొనుగోళ్లు ఊపందుకుంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం పై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,13,640 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,23, 970 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,60,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

