Tue Mar 24 2026 10:32:06 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? తెలుసుకోండిలా
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో భారీ తగ్గుదల కనపించింది

బంగారం ధరలు మరింతగా పడిపోతాయని కొందరు అంచనా వేస్తున్నారు. లేదు.. లేదు.. పడిపోతున్న ధరలు తిరిగి పుంజుకుని పరుగులు పెట్టే అవకాశాలున్నాయని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. అనేక రకాలుగా అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలోనే ధరలు ఇటీవల కాలంలో తగ్గుతూ వస్తున్నాయని, ఒక్కసారి పెరగడం ప్రారంభిస్తే వాటిని పట్టుకోవడం కష్టమేనని చాలా మంది అంచనా వేస్తున్నారు. అందుకే బంగారం, వెండి పై మదుపు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తీసుకోవద్దని కూడా సూచిస్తున్నారు.
యుద్ధానికి బ్రేక్ పడటంతో...
ఇరాన్ - అమెరికా యుద్ధానికి ఐదు రోజుల బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో యుద్ధం ముగియడంతో స్టాక్ మార్కెట్లు కూడా పుంజుకున్నాయి. అదే సమయంలో బంగారం, వెండి ధరలు మరింతగా పెరుగుతాయన్నది మార్కెట్ నిపుణుల అంచనాగా వినిపిస్తుంది. ప్రస్తుతం యుద్ధం కొనసాగుతుండటంతో బంగారంపై పెట్టిన పెట్టుబడిని వెనక్కు తీసుకోవడం, తమ వద్ద ఉన్న నగదును బంగారం, వెండిపై ఖర్చు పెట్టేందుకు ఎవరూ ఇష్టపడకపోవడంతో ధరలు గణనీయంగా పడిపోయాయని, అయితే యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి ధరలు పెరుగుతాయని అంటున్నారు.
నేటి ధరలు...
పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రస్తుతం లేదు. శుభకార్యాలు ముందుగానే ముహూర్తాలు ఫిక్స్ అయిన వారు కొనుగోలు చేస్తున్నారు. బులియన్ మార్కెట్ అయితే ప్రస్తుతం కళకళలాడుతూనే ఉంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరల్లో భారీ తగ్గుదల కనపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది వేల రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై ఇరవై వేల రూపాయలు తగ్గింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,24,340 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,35,640 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 2,29,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

