Fri Apr 10 2026 23:03:27 GMT+0530 (India Standard Time)
Gold Price Today : బంగారం ఇంతలా తగ్గిందా.. ఇక కొనేయొచ్చు మరి
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది

బంగారం ధరలు దిగివస్తున్నాయి. ప్రతి రోజూ వారం రోజుల నుంచి ఎంతో కొంత తగ్గుతూ వస్తున్నాయి. గతంలో విపరీతంగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా శాంతించాయి. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్రమయినప్పటికీ దాని ప్రభావం బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపడం లేదు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ధరలు దిగి వస్తున్నాయి. కొద్దిగా తగ్గినా, ఎక్కువగా తగ్గినా బంగారం, వెండి ధరలు పెరగకపోవడం చాలా శుభపరిణామమని అంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని యుద్ధం ఎఫెక్ట్ ధరలపై లేకపోవడం తీపి కబురు లాంటిదేనని అంటున్నారు.
యుద్ధం ఎఫెక్ట్ ...
ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభమయిన నాటి నుంచి బంగారం, వెండి ధరలు దాదాపు తగ్గుతోనో, స్థిరంగానో ఉంటున్నాయి తప్పించి పెరుగుదల కనిపించకపోవడం నిజంగా అదృష్టమేనంటున్నారు. జ్యుయలరీ మార్కెట్ కూడా కళకళలాడుతుంది. కస్టమర్లు ఇప్పుడిప్పుడే బంగారం కొనుగోలుకు వస్తున్నారు. అయితే ధరలు ఇంకా అంతగా అందుబాటులోకి రాకపోవడంతో కొందరు మీనమేషాలు లెక్కపెడుతున్నప్పటికీ పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుగుతుండటంతో అవసరానికి సరిపడా ఆభరణాల కొనుగోలుకు వస్తున్నారని, దీనివల్ల అమ్మకాలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
నేటి ధరలు...
ఇక పెట్టుబడి పెట్టే వారు మాత్రం ఒకింత వెనుకంజ వేస్తున్నారు. గతంలో బంగారం, వెండి కొనుగోలు చేసే వారి కంటే వాటిపై మదుపు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,47,290 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,60,680 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,89,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.
Next Story

