Mon Apr 06 2026 10:47:17 GMT+0530 (India Standard Time)
gold Price Today : తీపికబురు.. బంగారం ధరలు ఇంతగా పడిపోయాయా?
ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది

బంగారం ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్న సమయంలో ధరలు తగ్గుతున్నాయి. బంగారం, వెండి ధరలు ఇటీవల కాలంలో వరసగా తగ్గుతుండటం శుభపరిణామం. బంగారం, వెండి వస్తువుల కొనుగోలుకు కొనుగోలుదారులు ఒకింత ముందుకు వస్తున్నారు. దీంతో జ్యుయలరీ దుకాణాల వద్ద వినియోగదారుల సందడి నెలకొంది. అయితే ఇంకా ధరలు తగ్గుతాయని భావించిన కొందరు మరికొద్ది రోజుల పాటు వెయిట్ చేయాలని చూస్తున్నారు. అయితే ధరలు తగ్గే అవకాశం లేదని, ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
అవసరమైనంత మేరకే...
బంగారం అంటే అందరికీ ఇష్టమే. గతంలో తులాల లెక్కన కొనుగోలు చేసే వినియోగదారులు నేడు ధరలు కొంత అందుబాటులో లేకపోవడంతో గ్రాముల లెక్కన కొనుగోలు చేస్తున్నట్లు జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఎక్కువగా శుభకార్యాలకు సంబంధించిన వస్తువులు మాత్రమే అమ్ముడు పోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వధువు, వరుడుకు పెళ్లిళ్లలో పెట్టనున్న మంగళసూత్రాలు, బ్రాస్ లెట్లు, బంగారు ఉంగరం, చైన్ తదితర వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని, గతంలో మాదిరిగా నెక్లెస్ లు కొనుగోలు చేయడం లేదని వ్యాపారులు అంటున్నారు.
నేటి ధరలు...
పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు ఇంకా పెరిగే అవకాశముందని భావించిన కొందరు ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది శుభకార్యాలకు మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో కాసింత సందడి బంగారు దుకాణాల్లో నెలకొంది. ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ పది గ్రాముల బంగారం ధర 1,37,340 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,50,920 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,54,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

