Fri Apr 10 2026 22:00:47 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : బంగారు కొనేవారికి బిగ్ న్యూస్... ఇప్పుడే కొనేయండి
ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.

పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో బంగారం, వెండి ధరలు కొంత అందుబాటులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ధరలు దిగి వస్తున్నాయి. యుద్ధం ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమయినప్పటికీ గత పది నుంచి పదిహేను రోజుల నుంచి ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది. పెద్దగా పెరగడం లేదు. అదే సమయంలో ధరలు భారీగా తగ్గుతున్నాయి. మరికొన్ని రోజులు స్థిరంగా కొనసాగుతుండటం కూడా గోల్డ్ లవర్స్ కు ఊరట కలిగిస్తుంది. ఇరాన్ - అమెరికాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి.
భారతీయులే ఎక్కువగా...
బంగారాన్ని ఎక్కువగా భారతీయులే కొనుగోలు చేస్తారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల మేరకు శుభకార్యాలకు, పెళ్లిళ్లకు బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇటీవల కాలంలో పుట్టిన రోజు బహుమతిగా కూడా బంగారు ఆభరణాలను బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారు. అయితే ధరలు పెరిగిన తర్వాత ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. మిగిలిన దేశాల్లో గోల్డ్ బాండ్స్ ను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. తమ ఒంటిపై ఆభరణాలు ఉంచుకోవడం కంటే పెట్టుబడిపైనే ఎక్కువ మంది విదేశాల్లో ప్రాధాన్యత ఇస్తుంటారు.
నేటి ధరలు ఇలా...
ఇక ధరలు పెరిగిన తర్వాత బంగారం, వెండి ధరలపై పెట్టుబడి పెట్టేవారు కూడా కొంత వెనుకంజ వేస్తున్నారు. ధరలు మరింత తగ్గుతాయని భావించి మదుపు చేయడానికి కొంత వెనకడుగు వేస్తున్నారు. ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,37,340 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,49,830 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,54,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

