Mon Feb 23 2026 11:21:59 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఇది
. నేడు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి

బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అంచనాలకు తగినట్లుగానే బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. కొన్ని రోజుల పాటు ధరలు భారీగా తగ్గడంతో ఇంకా ధరలు తగ్గుతాయేమోనని వినియోగదారులు ఆశతో ఎదురు చూశారు. అయితే బంగారం ధరలు మళ్లీ పరుగు ప్రారంభించాయి. వెండి ధరల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. ధరలు పెరుగుదల కొనుగోళ్లపై ప్రభావం చూపే అవకాశముందన్న ఆందోళన బంగారు వ్యాపారుల్లో నెలకొంది. అయితే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు దిగువ వస్తుందని అనేక మంది అంచనా వేసినా అది జరిగే పని కాదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
గత వారమంతా...
గత వారమంతా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అయితే పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కావడంతో ధరలు మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. బంగారం ధరలు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో కేవలం అవసరం ఉన్న వారు మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. శుభకార్యాలకు అవసరమైనంత మేరకుమాత్రమే కొనుగోలు చేస్తున్నారని, గతంలో మాదిరిగా పెళ్లిళ్లలో బంగారం పెట్టుబడులు కూడా భారీగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. లక్ష రూపాయలకు దిగువకు వస్తేనే కొద్దో గొప్పో అమ్మకాలు ఊపందుకుంటాయి. అప్పటి వరకూ బంగారం కొనుగోళ్లు మందకొడిగానే సాగుతాయన్నది వాస్తవం.
నేటి ధరలు...
పెట్టుబడి పెట్టిన వారు కూడా బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని ఇంకా ఎదురు చూస్తున్నారు. పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం లేదు. మరొకవైపు శుభకార్యాల సమయంలో పసిడి ధరలు మరింత పెరగనున్నాయి. నేడు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,45,,990 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,59,270 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2,89,200 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.
Next Story

