Fri Apr 10 2026 01:50:15 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : గుడ్ న్యూస్.. పతనమవుతున్న పసిడి.. దిగి వస్తున్న వెండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది

బంగారం ధరలు మరింత తగ్గుతున్నాయి. వెండి ధరలు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా ఎలా పెరిగాయో అలాగే పతనమవుతున్నాయి. బంగారం అనేది భారతీయులకు సెంటిమెంట్. బంగారం, వెండి ఆభరణాలంటే సహజంగానే భారతీయులకు అత్యంత ఇష్టమైనవి. అంతే కాకుండా భారతీయ సంస్కృతి సంప్రదాయాల మేరకు భారతీయ జీవనశైలిలో ఒక భాగమయ్యాయి. అందుకే భారత్ లోనే బంగారం, వెండి కొనుగోళ్లు భారత్ లో ఎక్కువగా ఉంటున్నాయి. ఇక్కడే అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో గోల్డ్ మార్కెట్ కూడా భారత్ కు నిలయంగా మారిందని చెప్పాలి. అందులోనూ దక్షిణ భారత దేశంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది.
ఆఫర్లతో ఆకట్టుకుంటూ...
బంగారం అంటే అందరికీ ఇష్టమే. ఇక శుభకార్యాలకు బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. ఇక రేపటి నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో బంగారం, వెండి వస్తువుల అమ్మకాలు మరింత ఊపందుకున్నాయి. అందుకే ఇప్పటి వరకూ అమ్ముడుపోని స్టాక్ ను బయటకు తీసి జ్యుయలరీ దుకాణాల యజమానులు మెరుగులు దిద్దుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కు ముందే కొనుగోళ్లు ఎక్కువయ్యాయని, అందుకే బంగారం, వెండి వస్తువులపై మరింత రాయితీలు కూడా జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు దుకాణాల యజమానులు ప్రయత్నిస్తున్నారు.
నేటి ధరలు ఇలా...
బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టిన వారు మాత్రం ఈ సారి తీవ్రంగా నష్టపోయారు. ఈసారి బంగారం, వెండి ధరలు భారీగా పతనమవ్వడంతో మదుపు చేసిన వారు మాత్రం లబోదిబోమంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. ఈ నెలలోనే బంగారం ధరపై పథ్నాలుగు వేలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,41,134 రూపాయలుగా నమోదయింది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,54,190 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెందడి ధర 2,79,900 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.
Next Story

