Fri Mar 27 2026 23:42:45 GMT+0530 (India Standard Time)
Gold Price Today : పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకోవద్దు.. ఇది నిపుణుల సూచన
ఈరోజు దేశంలో స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

బంగారం క్రమంగా దిగి వస్తుంది. అయితే ఎంత వరకూ ధరలు దిగివస్తాయన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఇంకా దిగి రావాలని ఇటు వినియోగదారులు, అటు వ్యాపారులు సయితం కోరుకుంటున్నారు. బంగారం ధరలు అందుబాటులో ఉంటేనే క్రయవిక్రయాలు జోరుగా జరుగుతాయి. అప్పుడే మార్కెట్ కళకళలాడుతుంటుంది. ఇంతలా ధరలు పెరిగిపోయినప్పుడు సహజంగా కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. అందుకే అన్ని వర్గాలు ధరలు అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నారు. గత కొన్నాళ్లుగా ధరలు దిగి వస్తున్నాయి. అయితే ఇంకా ఆశించినంత రీతిలో ధరలు తగ్గడం లేదు. పెరిగినంత వేగంగా మాత్రం ధరలు తగ్గడం లేదన్నది వాస్తవం.
అనేక కారణాల ప్రభావం...
ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిణామాలు ధరల పై ప్రభావం చూపినప్పటికీ.. ఏ వస్తువయినా ధరలు కొనుగోలు చేయగలిగిన పరిస్థితిలో ఉంటేనే దానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. కానీ ధరల పెరుగుదల, తగ్గుదల ఎవరి చేతులోనూ ఉండదు. డిమాండ్ తోనూ, సీజన్ తోనూ సంబంధం లేకుండా మార్పులు జరిగేది ఒక్క బంగారం, వెండి విషయంలోనే. అందుకే ఎవరూ ఎప్పుడు ధరలు పెరుగుతాయి.. ఎప్పుడు తగ్గుతాయన్నది స్పష్టమైన అంచనా వేయలేకపోతున్నారు. దీనివల్ల కొనుగోలుకు అనేక మంది వెనకాడుతున్నారు. అమెరికా ఫెడరల్ మార్కెట్ ప్రభావంతో పాటు, ట్రంప్ నిర్ణయాలు, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి విషయాలు కూడా హెచ్చుతగ్గుదలకు కారణమవుతాయి.
పెట్టుబడి పెట్టేవారు...
అందుకే బంగారం, వెండి పై పెట్టుబడి పెట్టేవారు సయితం కొంత ఆలోచనలో పడ్డారు. ఇటీవల వెండిపై భారీగా పెట్టుబడి పెట్టి నష్టపోయిన వారు ఇక చేతులు కాల్చుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈరోజు దేశంలో స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,43,540 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,56,590 రూపాయలకు పడిపోయింది. ఇక కిలో వెండి ధర 2,84,900 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి మళ్లీ మార్పులుండవచ్చు.
Next Story

