Mon Feb 02 2026 05:24:25 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు కూడా తగ్గిన బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది.

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్.. బంగారం కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా ఉండాల్సిన సమయం. కానీ గోల్డ్ షాపుల్లో ఆ సందడి లేదు. బంగారం కొనాలన్న ఆలోచనే పక్కన పెట్టేశారు జనం. కానీ గోల్డ్ రేట్ మాత్రం పగ్గాలు లేకుండా దూసుకుపోతోంది. మార్కెట్ సూత్రం ప్రకారం..డిమాండ్ తగ్గితే ధర తగ్గాలి. మరి గోల్డ్ విషయంలో ధరలు తగ్గినప్పటికీ ఇంకా అందుబాటులోకి రాలేదు. బంగారం, వెండి ధరలు ఇటీవల కాలంలో కొంత తగ్గుముఖం పట్టినా ఇంకా కొనుగోలు చేసేంత స్థాయికి మాత్రం రాలేదని వినియోగదారులు వాపోతున్నారు. బంగారం, వెండి ధరలు కొనుగోళ్లు పెరిగినప్పుడే వాటి డిమాండ్ కూడా అధికంగా ఉంటుంది. కానీ డిమాండ్ లేకపోయినా ధరలు ఆశించిన రీతిలో తగ్గడం లేదు.
గత కొన్ని రోజులుగా...
పట్టపగ్గాలు లేకుండా పెరిగిపోతోంది బంగారం రేటు. ఏ రోజుకారోజు..సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. బంగారం ధర పెరుగుతోందంటే.. అదికొన్నవాళ్లలో ఆనందం ఉండాలి. కానీ ప్రస్తుతం బంగారం కొంటున్న వాళ్లలో ఒకరకమైన భయం మొదలయింది. బంగారం ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ధరలను చూస్తే బుడగ మాదిరి ఎప్పుడైనా పేలిపోతుందని, ధరలు పతనమవుతాయన్న అంచనాలు వినిపించాయి. అందుకు తగినట్లుగా గత నాలుగైదు రోజులుగా ధరలు విపరీతంగా పతనమయ్యాయి. బంగారాన్ని ఇప్పుడు కొనుగోలు చేయాలంటే కొందరికే సాధ్యమవుతుందన్న నమ్మకంతో పెరిగింది. ధరలు కూడా అలాగే ఉండటంతో కొనుగోళ్లు బాగా మందగించాయి.
నేటి ధరలిలా...
గత నాలుగైదు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో మాత్రం తగ్గ లేదు. గత పథ్నాలుగు నెలలుగా పెరిగిన తీరులో ధరలు తగ్గలేదని, మరికొంత తగ్గాల్సి ఉంటుందని జ్యుయలరీ దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగరాం ధర 1,47,190 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,60,570 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 3,19,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

