Sat Jan 31 2026 06:07:36 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : గుడ్ న్యూస్... భారీగా పడిపోయిన బంగారం ధరలు..వెండి ఢమాల్
బంగారం ధరలు ఈరోజు దేశంలో భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీగా పతనం మొదలయింది

పట్టపగ్గాలు లేకుండా బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ఏ రోజుకారోజు..సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. బంగారం ధర పెరుగుతోందంటే.. అదికొన్నవాళ్లలో ఆనందం ఉండాలి. కానీ ప్రస్తుతం బంగారం కొంటున్న వాళ్లలో ఒకరకమైన భయం మొదలయింది. ఎందుకంటే.. బంగారం ధర నిజంగా పెరుగుతోందా..? లేక ఎవరైనా కావాలని పెంచుతున్నారా..? అనే సందేహం వారిని వెంటాడుతోంది. గతంలో జరిగిన పరిణామాలు కూడా అందుకు కారణం. 2025లోనే బంగారం ధర 60 శాతం పెరిగింది. ఇది మామూలు పెరుగుదల కాదు.. అసాధారణమైన పెరుగుదల. ఇది ఒకరకంగా ‘బబుల్’ అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ బబుల్ ఎప్పుడైనా పగిలిపోవచ్చని.. సామాన్యులు ఆ ట్రాప్‌లో పడవద్దని హెచ్చరిస్తున్నారు.
ధరలు పెరుగుదల...
బంగారం ధర ఈ స్థాయిలో పెరుగుదలకు విదేశీ సంస్థల ‘రిపోర్ట్’ మాయాజాలం కూడా కారణం కావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు.. గోల్డ్‌మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ వంటి పెద్ద పెద్ద విదేశీ రీసెర్చ్ సంస్థలు బంగారం ఇంకా పెరుగుతుందంటూ పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తాయి. సామాన్యులు ఆ రిపోర్ట్స్ నమ్మి ఎగబడి కొంటారు. అదే సమయంలో.. ఆ సంస్థలు, పెద్ద ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని మెల్లగా అమ్ముకుని లాభాలు తీసుకుంటారు. చివరికి రేట్లు పడిపోయాక..వాళ్లు లాభాల్లో ఉంటారు. గరిష్ట రేటుకు కొన్న సామాన్యులు మాత్రం నష్టాల్లో చిక్కుకుంటారు.ఏదైనా వస్తువు ధర సప్లై-డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ బంగారం ధర మాత్రం లండన్, న్యూయార్క్‌లో ఉండే కొన్ని పెద్ద బ్యాంకులు కూడబలుక్కొని ధరను ఫిక్స్ చేస్తాయన్న ఆరోపణలు ఉన్నాయి.
నేటి ధరలు...
పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి ధరలు మరింత దిగిరావాలని అనేక మంది కోరుకుంటారు. తాము కొనుగోలు చేసే విధంగా బంగారం, వెండి ధరలు దిగి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అనుకున్నట్లుగానే బంగారం ధరలు ఈరోజు దేశంలో భారీగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా భారీగా పతనం మొదలయింది. పది గ్రాముల బంగారం ధరపై 9,650 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై ఇరవై వేల రూపాయల వరకూ తగ్గింది. ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,55,100 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,69,190 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 4,05,000 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

