Thu Mar 05 2026 10:56:28 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : గుడ్ న్యూస్... బంగారాన్ని ఇప్పుడే కొనండి.. ఇంత తగ్గడం ఎప్పుడైనా చూశారా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది

బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వెండి ధరలు కూడా పతనం అవుతున్నాయి. గత కొన్ని నెలలుగా పెరగడమే తెలిసినట్లుగా బంగారం, వెండి పరుగులు పెడుతూ వినియోగదారులు, కొనుగోలు దారుల ఆశలపై నీళ్లుచల్లాయి. కానీ గత రెండు రోజుల నుంచి ధరలు దిగి వస్తున్నాయి. ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం తో ధరలు మరింత పెరుగుతాయని అంచనావేస్తే అందుకు విరుద్ధంగా ధరలు దిగి రావడం శుభపరిణామమేనని చెప్పాలి. యుద్ధం కారణంగా ధరలు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ భారీగా ధరలు తగ్గుతుండటంతో కొనుగోలు దారులు జ్యుయలరీ దుకాణాలకు క్యూ కడుతున్నారు. అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి.
ఎన్నడూ లేని విధంగా...
గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గతంలో కారణం లేకుండానే ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, బంగారం దిగుమతులు తక్కువగా ఉండటం, యుద్ధాల ప్రభావం బంగారం,వెండి ధరలపై ప్రభావం చూపేవి. కానీ నేడు యుద్ధాలు జరుగుతున్న సమయంలోనూ ధరలు తగ్గుతున్నాయని,అందులోనూ పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో కొనుగోలు చేసే వారికి మరింత అనుకూలమైన వాతావరణం నెలకొని ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం, వెండి ధరలు ఎప్పుడు తగ్గుతాయో.. ఎందుకు పెరుగుతాయో కారణాలు మాత్రం ఎవరికీ తెలియవు.
నేటి ధరలు ఇలా...
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పాటు ధరలు దిగి వస్తుండటంతో అందరూ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. ఈరోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు తగ్గింది. వెండి ధరపై కిలో కు వంద రూపాయలు తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,50,800 రూపాయలుకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,64,510 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,95,000 రూపాయలు వద్ద ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికిధరల్లో మార్పులుండవచ్చు.
Next Story

