Thu Mar 12 2026 16:33:01 GMT+0530 (India Standard Time)
Gold Rates Today : బంగారం కొనేవారికి హోలీ గిఫ్ట్.. ధరలు ఎంత తగ్గాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది

బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. రాకెట్ లా దూసుకుపోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా తలెత్తిన ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని అంచనాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గింది. కేవలం పెట్టుబడి పెట్టే వారు మాత్రమే బంగారం, వెండి కొనుగోళ్ల పట్ల ఆసక్తి చూపుతున్నారు.
యుద్ధం కారణంగా...
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు మరింత ఎగబాకుతాయని అంటున్నారు. గత కొంతకాలంగా బంగారం ధరలు మరింతగా పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా గరిష్టానికి చేరుకున్నాయి. నిన్న మొన్నటి వరకూ తగ్గిన ధరలు తిరిగి యుద్ధం మొదలు కావడంతో ధరలు పెరిగి పతాక స్థాయికి చేరుకన్నాయి. దీంతో ధరలు ఏ మేరకు పెరుగుతాయన్నఅంచనాలు మాత్రం వినిపించడం లేదు. రానున్న కాలంలో ధరలు మరింతగా పెరిగే అవకాశముందని కూడా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో...
మరొకవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, వెండి విక్రయాలు ఊపందుకున్నాయి. అయితే భారీ స్థాయిలో జరగకపోయినా గతంలో కొంటే కొంత మెరుగ్గానే అమ్మకాలు సాగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. ఈరోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,56,290 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,70,500 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 3,14,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.
Next Story

