Fri Mar 06 2026 10:45:00 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : అదిరిపోయే న్యూస్.. బంగారం ధరలు ఎంత తగ్గాయో తెలుసా?
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది

బంగారం ధరలు ఎగబాకడం లేదు. పైగా పతనంవైపు వెళుతున్నాయి. వెండి ధరలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. గత రెండు, మూడు రోజు ల నుంచి బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం వారం రోజుల నుంచి జరుగుతుంది. అయితే ఈ యుద్ధం ప్రభావంతో ధరలు మరింత పెరుగుతాయని అంచనాలు వేశారు. కానీ బంగారం, వెండి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. ఒక రకంగా కొనుగోలు చేసే వారికి శుభవార్త అని చెప్పాలి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ధరలు దిగివస్తుండటంతో వీటి కొనుగోళ్లు పెరిగే అవకాశముందని జ్యుయలరీ దుకాణాల యజమానులు అంచనా వేస్తున్నారు.
రాకెట్ తరహాలో...
బంగారం, వెండి ధరలు రాకెట్ తరహాలో నిన్న మొన్నటి వరకూ దూసుకు వెళ్లాయి. ఎంతగా అంటే ఇక బంగారం, వెండిని కొనుగోలు చేయలేమో అన్నంత స్థాయికి వాటి ధరలు చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు పదిహేను నెలల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అందుకేధరలు పెరిగిన ప్రభావం స్పష్టంగా అమ్మకాలపై పడింది. బంగారం ఇక దూరమైందని మధ్య తరగతి, వేతన జీవులు డిసైడ్ అయిపోయిన సమయంలో క్రమంగా ధరలు దిగి వస్తుండటం కొంత మార్కెట్ కు శాశాజనకమనే చెప్పాలి. బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసే వారికి ఇది అనువైన సమయమని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు.
నేటి ధరలు...
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయిన వెంటనే ధరలు పెరుగుతాయని అంచనాలు వినిపించాయి. అలాగే యుద్ధం వల్ల కూడా ధరలు పెరుగుతాయని అనుకున్నారు. కానీ ధరలు దిగి వస్తుండటం కొంత సానుకూల పరిణామమేనని చెప్పాలి. ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,49,290 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,62,870 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,94,900 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.
Next Story

