Wed Feb 19 2025 21:34:33 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : వామ్మో... బంగారం ధరలు ఇంత పెరిగాయా? షాకింగ్ న్యూస్ కాక మరేంటి?
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి

బంగారం ధరల పెరుగుదల ఆగేట్లు కనపడటం లేదు. ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కొంత దిగివచ్చిన బంగారం ధరలతో పసిడి ప్రియులు ఖుషీ అయ్యారు. బంగారం పరవాలేదు.. అందుబాటులోకి వస్తుందని ఆనంద పడ్డారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. దాదాపు కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పరుగును ప్రారంభించాయి. ఇక ఆగేందుకు అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్ లో బంగారం, వెండి వస్తువులకు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. డిమాండ్ తగ్గని ఒకే ఒక వస్తువు అంటే పసిడి అనే చెప్పాలి. అందుకే తగ్గినప్పుడే వాటిని కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
సీజన్ కావడంతో...
కానీ శ్రావణ మాసంలో కొంత ధరలు తగ్గి పసిడి ప్రియులను ఊరించడంతో మరింతగా ధరలు తగ్గుతాయని భావించారు. కేంద్ర బడ్జెట్ లో కస్టమ్స్ సుంకం బంగారంపై తగ్గించడంతో ధరలు మరింత దిగి వస్తాయని ఆశించారు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ మొదలయింది. బంగారం కొనుగోళ్లు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. జ్యుయలరీ దుకాణాలన్నీ వినియోగదారులతో కిటకిట లాడుతున్నాయి. జ్యుయలరీ దుకాణాలు సరికొత్త డిజైన్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పసిడి నేల చూపులు చూస్తుందనుకుంటే ఆకాశం వైపు పరుగులు పెడుతుండటంతో గోల్డ్ లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నేడు స్థిరంగా...
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. అయితే నిన్న పది గ్రాముల బంగారం ధరపై 1100 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర 1,900 రూపాయల వరకూ పెరిగింది. అయితే ఈరోజు స్థిరంగా ఉన్నాయని అనుకోవడానికి లేదు. ఉదయం ఆరు గంటల వరకే ఈ ధరలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,700 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,770 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 91,000 రూపాయలగా నమోదయింది.
Next Story