Wed Feb 12 2025 08:45:21 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices Today : ఈరోజు బంగారం కొనుగోలు చేసే వారికి మాత్రం గుడ్ న్యూస్
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి

బంగారం ధరలు తగ్గాయంటే పెరగడానికి సంకేతాలు మాత్రమే. ఎందుకంటే పరుగు ఆపిందంటే కొంత విరామం తీసుకుని మళ్లీ రన్ ప్రారంభిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే బంగారానికి పెరగడమే తప్ప తగ్గడం అంతగా తెలియదని ఛలోక్తులు వినిపిస్తుంటాయి. అది నిజం కూడా. తగ్గితే స్వల్పంగా, పెరిగితే భారీగా పెరగడం కూడా బంగారం విషయంలో మాత్రమే మనం చూస్తాం. బంగారం, వెండి ధరలు ఇలా పెరగడానికి అనేక కారణాలున్నాయంటున్నారు మార్కెట్ నిపుణులు.
కొనుగోళ్లు మాత్రం...
అయితే ఏది ఏమైనా బంగారం ధరలు పెరగడం వల్ల కొనుగోళ్లు ఆగుతాయనుకుంటే అది భ్రమే అవుతుంది. బంగారం కేవలం ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడిగా చూడటం ప్రారంభమయిన నాటి నుంచి కొనుగోళ్లు పెరిగాయి. భారత్ లో బంగారంతో బంధం ఈనాటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నది. ముఖ్యంగా మహిళలు అత్యంత ఇష్టపడే బంగారం ధరలు ఎంత పెరిగినా చివరకు కొనుగోలు చేయక తప్పింది కాదు. మదుపరులు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తారు.
ధరలు ఇలా...
ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశముందని చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,500 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,550 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 98,000 రూపాయలుగా ఉంది.
Next Story