Fri Dec 05 2025 22:48:09 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : బంగారం ధరలకు బ్రేకులు.. ఇక కొనుగోలు చేయవచ్చు తల్లీ
నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. ధరలు తగ్గడమనేది జరగదు. చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఎందుకంటే బంగారానికి ఉన్న డిమాండ్ అలాంటిది. బంగారాన్ని స్టేటస్ సింబల్ గా భావించే వారు కొనుగోలు చేయకుండా ఉండలేరు. ధరలు ఎంత పెరిగినా కొనుగోలు చేయడం మాత్రం మానరు. కానీ గత కొద్ది రోజుల నుంచి ధరలు మరింతగా పెరుగుతుండటంతో పాటు కొనుగోలు చేయలేని పరిస్థితికి ధరలు చేరుకోవడంతో అమ్మకాలు చాలా వరకూ పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. అయినా సరే బంగారం ధరలు ఎంత పెరిగినా కొనుగోలు చేస్తారని, ధరలు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని కూడా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అమ్మకాలు నిలిచిపోవడంతో...
ఇదే సమయంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఏ మాత్రం ధరలు తగ్గినా బంగారాన్ని సొంతం చేసుకుందామని భావిస్తుంటారు. అయితే గత కొద్ది రోజులుగా బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. పెరిగిన ధరలతో అమ్మకాలు నిలిచిపోవడంతో పాటు డిమాండ్ కూడా భారీగా పడిపోవడంతో ధరలు కూడా దిగిరాక తప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అందుకు అంతర్జాతీయ ధరల ఒడిదడుకులు, ట్రంప్ నిర్ణయాలు, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధ వాతావరణం, అమెరికా, చైనా ట్రేడ్ వార్ వంటి వాటితో బంగారం ధరలు మరింతగా పెరుగుతాయన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ధరలు గత కొద్ది రోజులుగా తగ్గడం కొంత ఊరట కలిగించే విషయమే.
ధరలు ఇలా...
బంగారాన్ని కొనుగోలు చేసేంత ధరలు తగ్గకపోయినా, మధ్యతరగతి ప్రజలకు ధరలు అందుబాటులోకి ఇంకా రాకపోయినా ఇంకా ధరలు తగ్గుతాయేమోనని ఆశగా కొనుగోలు దారులు ఎదురు చూస్తున్నారు. అయితే నేడు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి ఈ ధరలు పెరగొచ్చు. తగ్గొచ్చు. లేకుంటే స్థిరంగానే కొనసాగవచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,550 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 95,510 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,09,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story

