Fri May 03 2024 20:08:50 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices : ఈరోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం ధరలు నేడు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి
పసిడి ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉంటుంది. దానిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. డిమాండ్ ను బట్టి మాత్రమే కాకుండా అనేక కారణాలతో బంగారం ధరలు పెరుగుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతుంటారు. అందుకే గత కొద్దిరోజులుగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ కొనుగోలుదారుల్లో కలవరం పుట్టిస్తున్నాయి.
కొందరికే పరిమితం...
బంగారం అంటే అదొక విలాసవంతమైన వస్తువుగా మారింది. పసిడి కొందరికే పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. భారతీయులు.. అందులోనూ దక్షిణ భారత దేశంలో ఎక్కువగా వినియోగించే పసిడి విషయంలో ఎవరూ రాజీపడరు. కొందరు పసిడిని పెట్టుబడిగా చూస్తుండగా, మరికొందరు అవసరాలు, సంస్కృతి సంప్రదాయాల కోసం, కుటుంబంలో జరిగే శుభకార్యాల నిమిత్తం కొనుగోలు చేస్తుండటం ఆనవాయితీగా వస్తుంది. బంగారం ధర మరింత పెరుగుతుందని తెలిసినా కొనుగోలు చేయక తప్పని పరిస్థితి.
తగ్గిన వెండి...
ఈరోజు బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఒకరకంగా శుభవార్తేనని చెప్పాలి. బంగారం ధరలు నేడు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ఇది కొంత ఊరట కల్గించే అంశమేనని చెప్పుకోవాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,550 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 61,690 రూపాయలుగా నమోదయి ఉంది. కిలో వెండి ధర 79,000 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.
Next Story