Wed Feb 25 2026 11:56:52 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : మార్చి నెలలో బంగారం ధరలు తగ్గుతాయా? నిపుణులేమంటున్నారు?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కొంత తగ్గుదల కనిపించింది

బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతున్నాయి కానీ ఇంకా వినియోగదారులకు మాత్రం ధరలు అందుబాటులోకి రాలేదు. ధరలు పెరిగితే భారీగా పెరగడం, తగ్గితే మాత్రం స్వల్పంగా తగ్గడంతో ధరల్లో పెద్దగా మార్పులు లేవు. దీంతో బంగారం కొనుగోలు చేయాలంటే వినియోగదారులు ముందుకు రావడం లేదు. మరొకవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కానుండటంతో బంగారం, వెండి కొనుగోళ్లు గతంలో కంటే కొంత మెరుగ్గా కనిపించినప్పటికీ ఆశించిన రీతిలో మాత్రం అమ్మకాలు జరగడం లేదని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. మార్చి నెలలో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశముందన్న అంచనాలు మాత్రం భారీగా వినపడుతున్నాయి.
నిల్వలు లేకపోవడంతో...
మార్చి నెలలో బంగారం, వెండి ధరలు పెరుగుతాయంటూ సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో కొంత వాస్తవం ఉందని, అమెరికా ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు, అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ఇరాన్ - అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం వంటివి బంగారం ధరలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ధరలు ఎవరి చేతుల్లో ఉండవు. అందులోనూ డిమాండ్ కు తగినట్లుగా బంగారం నిల్వలు లేకపోవడంతో పాటు కేంద్ర బ్యాంకులు వద్ద బంగారం నిల్వలు పేరుకుపోవడం వంటి అంశాలు కూడా బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమంటున్నారు.
నేటి ధరలు ఇలా...
పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కావడంతో కొంత అమ్మకాలు పెరిగాయి. డిమాండ్ పెరిగింది. మరొకవైపు మదుపు చేసిన వారు కూడా ఇంకా ధరలు పెరుగుతాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కొంత తగ్గుదల కనిపించింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,48,310 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,,61,790 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,84,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరలు మరింతగా పెరగవచ్చు. తగ్గవచ్చు. స్థిరంగా కొనసాగవచ్చు.
Next Story

