Sat Feb 21 2026 11:29:18 GMT+0530 (India Standard Time)
Gold Price Today : అందినట్లే అంది బంగారం చిక్కకుండా పోతుందా ఏంది?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి

బంగారం ధరలు చిక్కినట్లే చిక్కి అందకుండా పోతున్నాయి. గత కొన్నాళ్లుగా ధరలు దిగి వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పరుగు అందుకుంది. వెండి ధరల్లో కొంత మార్పులు కనిపించకపోయినప్పటికీ రానున్న కాలంలో ధరలు మరింత పెరగనున్నట్లు అంచనాలు వినపడుతున్నాయి. అయితే ఇది స్వల్ప పెరుగుదల మాత్రమేనని, ఇంకా తగ్గే అవకాశముందన్న సంకేతాలు కూడా అందుతున్నాయి. బంగారం అనేది ఎప్పుడూ నిలకడగా ఉండదు. ప్రతి రోజూ మార్పులు, చేర్పులు ఉంటాయి. వాటి ధరలు నిలకడగా ఉండకుండా ఉండటానికి అనేక కారణాలున్నాయి. అందుకే బంగారం ధరలపై ఎప్పుడూ ఎవరికీ పెద్దగా నమ్మకం ఉండదు. పెట్టుకోవడం కూడా అనవసరం.
మరింతగా పెరిగి...
పసిడి ధరలు మరింతగా పెరుగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భారీగా ధరలు పెరుగుతుండటంతో నిన్న మొన్నటి వరకూ ఇక పసిడి ధరలు దిగి వస్తాయని ఆశిస్తున్న వారికి నిరాశ ఎదురయింది. అందులోనూ పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పాటు ముహూర్తాలు కూడా ఎక్కువగా ఉండటంతో బంగారం, వెండి వస్తువుల గిరాకీపై ఈ ప్రభావం పడుతుందని జ్యుయలరీ దుకాణాల యాజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది నుంచి పెరిగిన ధరలతో బంగారం, వెండి వస్తువులు అమ్ముడు పోక చాలా ఇబ్బందులు పడ్డామని, కనీసం నిర్వహణ ఖర్చులు కూడా రాలేదని, మళ్లీ అదే పరిస్థితి వస్తే కోలుకోవడం కష్టమేనని అంటున్నారు.
నేటి ధరలు...
ఇక పెట్టుబడి పెట్టేవారు సయితం ధరలు పెరుగుతుండటంతో కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ధరలు భారీగా పతనమవ్వడంతో బంగారం, వెండిపై పెట్టిన పెట్టుబడులను వెనక్కు తీసుకోలేదు. కొంత కాలం వెయిట్ చేయాలని భావించారు. ఇప్పుడు ధరలు పెరుగుతుండటంతో మరికొద్ది కాలం వెయిట్ చేయాలని భావిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 850 రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,44,260 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,57,380 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,69,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.
Next Story

