Fri Feb 20 2026 16:43:24 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. ఎంత పెరిగాయో తెలిస్తే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది

బంగారం ధరలు తగ్గుతాయి కదా అనుకుని కూర్చుంటే అవి షాకిస్తాయి. అందుకే అందుబాటులోకి వచ్చినప్పుడు.. ధరలు కొంత తగ్గినప్పుడు అవసరమైన వాళ్లు కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ధరల పెరుగుదల ఎవరి చేతుల్లో ఉండదు. ధరలు దిగివస్తాయని ఎదురు చూస్తే అసలు కొనలేని పరిస్థితులు కూడా గతంలో వచ్చాయి. నాడు పది గ్రాముల బంగారం ధర 90 వేల రూపాయలు ఉంటే అమ్మో అంత ధర అని కొనుగోలు చేయడం మానేసి ధరలు పతనమవుతాయని ఎదురు చూశారు. కానీ అలా చూసిన వారికి చుక్కలు కనిపించేలా ధరలు పెరిగాయి. ఇక బంగారం కొనుగోలు చేయలేమన్న స్థితికి వచ్చేశారు చాలా మంది.
మదుపు చేసిన వారు...
వెండి విషయంలోనూ అదే జరుగుతుంది. అయితే గతంలో బంగారం, వెండిపై పెట్టుబడి సురక్షితమని నమ్మేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నమ్మకం పూర్తిగా పోయింది. ధరలు ఒక్కసారిగా పెరగడం, అంతే స్థాయిలో తగ్గుతుండటంతో పెట్టుబడి పెట్టిన వారు ఆర్థిక నష్టాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. గత కొన్నాళ్లుగా దేశంలో అదే జరిగింది. వెండిపైన, బంగారంపైన మదుపు చేసిన వారు చాలా మంది తీవ్రంగా నష్టపోవడమే కాకుండా అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టడంతో కోలుకోలేని పరిస్థితికి చేరుకున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అందుకే బంగారాన్ని, వెండిని అవసరమైతే తప్ప కొనుగోలు చేయకూడదన్న షరతు అందరూ పాటిస్తేనే మేలంటున్నారు.
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో...
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమయింది. ఇక కొన్ని నెలల పాటు పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముహూర్తాలు కూడా మంచివి ఉండటంతో బంగారం, వెండి వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 2,100 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై పది వేల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,43,460 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,56,500 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,70,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
Next Story

