Sun Feb 15 2026 15:44:53 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఎంత పెరిగాయో తెలిస్తే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి

బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయన్నది ఎవరూ అంచనా వేయలేరు. అందుకే తగ్గినప్పుడే బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు తరచూ సూచిస్తుంటారు. ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం కానుండటంతో ఇక బంగారం, వెండి ఆభరణాలకు మరింత డిమాండ్ పెరగనుంది. ఇంకా ధరలు పెరిగే అవకాశముందన్న అంచనాల్లో వ్యాపారులు కూడా ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ బంగారం, వెండి పై పెట్టుబడి పెట్టిన వారు కూడా పెళ్లిళ్ల సీజన్ వరకూ చూద్దాం అని వేచి చూస్తున్నారు. వారు పెట్టుబడులను ఉపసంహరించుకోలేదు. కొంత వెయిట్ చేస్తే తిరిగి లాభం వస్తే విక్రయించుకోవచ్చన్న తలంపుతో ఉన్నారు.
ఇప్పుడిప్పుడే ధరలు...
బంగారం, వెండి ధరలు ఇటీవల కొంత తగ్గుతుండటంతో జ్యుయలరీ దుకాణాలకు ఇప్పటిప్పుడే కొనుగోలు దారులు వస్తున్నారు. నిన్నటి వరకూ వెలవెల బోయిన బంగారు దుకాణాలు కొద్ది రోజుల నుంచి కళకళ లాడుతున్నాయి. అయితే ఇంకా పూర్తిగా ధరలు తగ్గలేదని అంటున్నప్పటికీ అవసరానికి కావాల్సిన వాళ్లు, పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ అయిన వారు బంగారం, వెండిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అమెరికన్ డాలర్ బలహీనపడినందున బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశముందని చెబుతున్నారు. అలాగే అగ్రరాజ్యం అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం కూడా వీటి ధరలపై ప్రభావం చూపుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నేటి ధరలు...
పెళ్లిళ్ల సీజన్ ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇక అప్పటి నుంచి బంగారం, వెండి వస్తువుల కొనుగోళ్లు మరింత పెరుగతాయి. ధరలు కూడా పెరిగే అవకాశముందని అంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర పై దాదాపు రెండు వేల రూపాయలు పెరిగింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,44,600 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,57,750 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 2,80,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
Next Story

