Sat Mar 28 2026 10:35:54 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : గుడ్ న్యూస్...బంగారం, వెండి ఇప్పుడు కొంటే లాభమేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర భారీగా తగ్గింది

బంగారం ధరలు ఊరిస్తున్నాయి. ఒకరోజు పెరుగుతుంటే.. మరొకరోజు తగ్గుతున్నాయి. ఎక్కువగా తగ్గడం లేదు. అలాగని పెరగడం లేదు. పశ్చిమాసియాలో యుద్ధం నెల రోజుల నుంచి కొనసాగుతున్న సమయంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనాలు మాత్రం నిజం కాలేదు. కొద్దో గొప్పో తగ్గాయి కానీ, భారీ పెరుగుదల కనిపించలేదు. ధరలు తగ్గుతాయని చాలా మంది ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు. గతంలో మాదిరిగా ధరలు పెరిగే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. అయితే త్వరలోనే భారీగా పెరుగుదల ఉంటుందని మరికొందరు అంచనా వేస్తున్నారు.
ధరల పెరుగుదలకు...
ధరల పెరుగుదలకు, డిమాండ్ కు బంగారం, వెండి విషయంలో మాత్రం సంబంధం ఉండదు. సీజన్ కాకపోయినా, డిమాండ్ లేకపోయినప్పటికీ ధరలు పెరుగుతుంటాయి. డిమాండ్ అధికంగా ఉన్న సీజన్ లోనూ ధరలు తగ్గుతుంటాయి. అందుకే బంగారం,వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో నెలకొన్న ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ మరింత బలపడటం వంటి అంశాలు బంగారం, వెండి మార్పులపై ప్రభావం చూపుతాయి. రానున్న కాలంలో ధరలు ఎలా ఉంటాయో అంచనాలకు అందడం లేదు.
నేటి ధరలు...
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ధరలు మళ్లీ పెరుగుతాయేమోనని, ముందుగానే కొందరు కొనుగోలు చేసి పెట్టుకునేందుకు జ్యుయలరీ దుకాణాలకు తరలి వస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర భారీగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధరపై 160 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై 15000 ర రూపాయలు తగ్గింది. ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,32,660 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,44,720 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,44,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.
Next Story

