Tue Mar 31 2026 11:14:18 GMT+0530 (India Standard Time)
Gold Price Today : బ్యాడ్ లక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర తగ్గింది.

బంగారం, వెండి ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు. ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో అంచనా వేయడం చాలా కష్టం. మార్కెట్ నిపుణులకు కూడా బంగారం ధరలపై అంచనా వేయలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ధరల్లో పెరుగుదల, తగ్గుదల ఎవరి చేతుల్లో లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, పశ్చిమాసియాలో నెల రోజులుగా కొనసాగుతున్న యుద్ధం, ట్రంప్ విధించిన అదనపు సుంకాల ప్రభావం కూడా బంగారం, వెండి ధరలపై పడుతుంది.
అమ్మకాలు ఊపందుకోవడంతో...
అయితే ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కొనసాగుతుండగా బంగారం, వెండి ధరలు పెద్దగా పెరగలేదు. అది చాలా వరకూ ఊరట కలిగించే అంశం. పెరగకపోగా ధరలు మరింతగా తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ధరల తగ్గుదలతో అమ్మకాలు ఊపందుకున్నాయని జ్యుయలరీ దుకాణాల యజమానులు చెబుతున్నారు. అలాగే ధరలు మళ్లీ పెరిగే అవకాశముందని భావించిన అనేక మంది బంగారం, వెండి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బులియన్ మార్కెట్ గతంతో పోలిస్తే ఇప్పుడు కస్టమర్లతో కళకళలాడుతుంది.
నేటి ధరలు...
అందులోనూ పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. మరొకవైపు పెట్టుబడి దారులు మాత్రం బంగారం, వెండిపై మదుపు చేసేందుకు ఆలోచిస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధర తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,35,910 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,48,270 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,55,100 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులుండవచ్చు.
Next Story

