Wed Mar 26 2025 08:07:17 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : మళ్లీ షాకిచ్చిన పసిడి ధరలు..ఈరోజు ఎంత పెరిగాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి

బంగారం ధరలకు రెక్కలు ఉన్నట్లుంది. ప్రతి రోజూ పెరుగుతూనే వినియోగదారులకు షాక్ కు గురిచేస్తున్నాయి. వెండి ధరలు కూడా బంగారంతో సమానంగా పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది. పది గ్రాముల బంగారం ధర 88 వేల రూపాయలకు చేరువలో ఉంది. కిలో వెండి ధర లక్ష దాటి చుక్కలు చూపుతుంది. ఈ రెండు వస్తువులు అందకుండా పోయాయి. సామన్య, పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం, వెండి కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ధరలు పెరిగినట్లుగా ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోవడంతో కొనుగోళ్లు చాలా వరకూ మందగించాయి. జ్యుయలరీ దుకాణాలు కూడా వినియోగదారులు లేక బోసి పోయి కనిపిస్తున్నాయి.
స్కీమ్ లు కట్టేవారు కూడా...
గతంలో బంగారాన్ని పొదుపు చేసి మరీ కొనుగోలు చేసే వారు. ఎక్కువ మంది జ్యుయలరీ దుకాణాల్లో నెల వారీ స్కీమ్ లను కట్టేవారు. నెలకు కొంత మొత్తాన్ని చెల్లించి స్కీమ్ గడువు పూర్తయిన తర్వాత దానికి కొంత మొత్తం కలిపి కొనుగోలు చేయవచ్చని భావించేవారు. కానీ ఇప్పుడు స్కీమ్ లు కట్టినా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేయాలంటే తమ స్థోమత సరిపోకపోవడంతో స్కీమ్ ల వైపు కూడా చూడటం మానేశారని, అనేక మంది వినియోగదారులు పెరిగిన బంగారం ధరలను చూసి కొన్ని నెలలు కట్టి వెనక్కు తగ్గిన వారు కూడా ఉన్నారని బంగారం దుకాణాల యాజమాన్యం చెబుతుంది. అదే సమయంలో రాయితీలు ప్రకటిస్తున్నా అటువైపు చూసేందుకు రావడం లేదు.
బంగారం పెరిగి.. వెండి తగ్గి...
బంగారం, వెండి పెళ్లిళ్ల సీజన్ లోనే ఇలా ఉంటే ఇక అన్ సీజన్ లో ఎలా ఉంటుందన్నది అర్ధం కావడం లేదని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. రానున్నకాలంలో ధరలు మరింత ఎక్కువవుతాయన్న అంచనాలు కూడా కొనుగోళ్లు తగ్గడానికి కారణమని చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర పై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఉదయం ఆరు గంటలకు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80,510 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,830 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,07,900 రూపాయలుగా నమోదయింది
Next Story