Wed Apr 01 2026 11:03:36 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : యుద్ధం కొనసాగితే బంగారం 70 వేలకు చేరుకుంటుందా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి

ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య మరింత కాలం కొనసాగితే బంగారం, వెండి ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పది గ్రాముల బంగారం ధర డెబ్భయి వేల రూపాయలకు చేరుకున్నాఆశ్చర్యం లేదని చెబుతున్నారు. అయితే ఇది అంత సులువు కాదు. అంత పెద్ద మొత్తంలో ధరలు తగ్గడం అనేది అరుదు అని, అది కేవలం ప్రచారం మాత్రమేనని కొందరు కొట్టిపారేస్తున్నారు. యుద్ధం కొనసాగుతున్న సమయంలో మాత్రం ధరలు పెరిగే అవకాశం లేదని, యుద్ధం ముగిసిన తర్వాత మాత్రం ధరలు మరింత ఎగిసి పడతాయని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు.
బంగారం కొనుగోళ్లపై...
బంగారం, వెండి వస్తువులపై అందరికీ ఆసక్తి ఉంటుంది. వీలయినప్పుడు, తమ ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పుడు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. మహిళలతో పాటు పురుషులకు కూడా బంగారం పై ఇటీవల మక్కువ ఎక్కువ గా కనపడుతుంది. ప్రధానంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కూడా బంగారం, వెండి వస్తువల పట్ల మమకారాన్ని పెంచుకోవడంతో పాటు వాటిపై మదుపు చేస్తుండటంతో వీటికి అత్యధికంగా డిమాండ్ పెరిగింది. డిమాండ్ కు తగినట్లుగా బంగారం దిగుమతులు లేకపోతే ధరలు పెరిగే అవకాశముందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.
ధరలు ఇలా...
ఇక పెట్టుబడి పెట్టేవారు కొంత వెనక్కు తగ్గుతుండగా, పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకునే వారు మాత్రం బంగారం, వెండి వస్తువులను విరివిగా ఇటీవల కాలంలో కొనుగోలు చేస్తున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,37,060 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,49,520 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,49,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది.
Next Story

