Tue Mar 17 2026 19:36:11 GMT+0530 (India Standard Time)
Gold Prices Today : వావ్.. ఈరోజుల్లో ఇంతటి గుడ్ న్యూస్.. నిజమేనంటారా?
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి.

బంగారం ధరలు మరింత ప్రియం కానున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో వెండి ధరలు కూడా ఇక మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. వచ్చేది సీజన్ కావడంతో పాటు ముహూర్తాలు కూడా ఆగస్టు నుంచి ఉండటంతో బంగారం, వెండి ధరలు మరింత ప్రియమవుతాయన్న లెక్కలు ఉన్నాయి. పసిడి ధర పది గ్రాములు ఎనభై వేల రూపాయలకు చేరుకుంటుందని, కిలో వెండి ధర లక్ష రూపాయలకు చేరుకుంటుందని చెబుతున్నారు.
సీజన్ స్టార్టయితే...
పెళ్లిళ్ల సీజన్ మళ్లీ ప్రారంభమయితే ఇక బంగారం, వెండి ధరలను పట్టుకోవడం ఎవరి తరమూ కాదు. అందుకే ఆఫ్ సీజన్ లో తమ కొనుగోళ్లను పెంచుకునేందుకు, కస్టమర్లను ఆకట్టుకునేందుకు జ్యుయలరీ దుకాణాలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. తరుగు మీద భారీగా ఆఫర్లు ఇస్తున్నాయి. వినియోగదారులు వచ్చి ఇప్పటికిప్పుడు కొనుగోలు చేసేలా పెద్దయెత్తున ప్రకటనలు కూడా చేస్తుండటంతో బంగారం, వెండి కొనుగోళ్లు కొంత తగ్గాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి
నేటి ధరలు...
అయితే దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. బంగారం, వెండి కొనుగోలు చేయాలంటే ఇదే మంచి సమయమని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,350 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,380 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 96,500 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story

