Sat Dec 06 2025 13:26:56 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rates Today : పసిడి ప్రియులకు షాక్.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గింది

పసిడి ధరలు ఎవరికీ అందకుండా పోతున్నాయి. ధరలు అదుపు చేయడం కూడా ఎవరి వల్ల కావడం లేదు. పెరుగుతున్న డిమాండ్ మేరకు మరింతగా ధరలు పెరిగే అవకాశముందన్న హెచ్చరికలు బలంగా వినపడుతున్నాయి. ఈ నెలలోనే పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకునే అవకాశముందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర 98 వేల రూపాయల మార్క్ ను దాటేసింది. ఇక కిలో వెండి ధర లక్ష తొమ్మిది వేల రూపాయలుగా ఉంది. ట్రంప్ వివిధ దేశాల్లో విధిస్తున్న సుంకాల ఫలితంగానూ, అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ కారణంగా ధరలు మరింతగా పెరుగుతాయంటున్నారు.
అనేక కారణాలు...
దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు వంటి కారణాలతో ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా తోడవ్వడంతో ధరలు మరింతగా పెరిగే అవకాశముందని అంచనాలు వినపడుతున్నాయి. బంగారం అంటేనే ఇప్పుడు కొందరికి మాత్రమే పరిమితమయింది. అందరి విషయంలో అది దూరంగా మారింది. ఎందుకంటే అంత డబ్బులు పోసి బంగారాన్ని, వెండిని కొనుగోలు చేయడం అనేది అసాధ్యం కావడంతో ఆ ప్రభావం అమ్మకాలపై కూడా పడనుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
స్వల్పంగా తగ్గి...
బంగారం అంటే ఇప్పుడు దాచుకునే వస్తువుగా మారిపోయింది. గోల్డ్ రేట్స్ ర్యాకెట్ కంటే స్పీడ్ గా పెరుగుతున్నాయి. దొంగలు కూడా బంగారం చోరీపైనే ఎక్కువగా కన్నేస్తున్నారంటే బంగారం ధరలు ఏ రేంజ్ లో పెరిగాయన్నది అర్థమవుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా బంగారం విషయంలో పెట్టుబడులు పెట్టాలని అందరూ భావించే సమయం వచ్చింది. అయితే దేశంలో ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన వాటి ప్రకారం ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,210 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 97,320 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 1,09,900 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.
Next Story

