Sat May 24 2025 12:11:09 GMT+0000 (Coordinated Universal Time)
Gold Price Today : బ్యాడ్ లక్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
నేడు దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగుదల కనిపించింది

బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయి. గత నాలుగు రోజుల పాటు ధరలు తగ్గడంతో ఇంకా ధరలు తగ్గుతాయని వినియోగదారులు ఆశపడ్డారు. అయితే ధరలు తగ్గినట్లే కనిపించినా మళ్లీ పెరగడం ప్రారంభించాయి. ధరలు ఎంత మేరకు పెరుగుతాయన్నది ఎవరూ చెప్పలేమని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలతో ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు వినపడుతున్న సమయంలో ధరలు పెరిగితే ఆ ప్రభావం కొనుగోళ్లపై పడుతుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కేవలం ధరలు తగ్గితే చాలదని, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా ధరలు వస్తేనే కొనుగోళ్లు పెరుగుతాయని అంటున్నారు.
లక్షను టచ్ చేసి...
బంగారం ధరలు సీజన్ లో పెరగడం మామూలే. కానీ ఈ ఏడాది మాత్రం ధరలు మరింతగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతుండటంతో లక్ష రూపాయలను పది గ్రాముల బంగారం టచ్ చేసింది. తర్వాత తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో లక్ష రూపాయలకు చేరువలో ఉంది. ఇంత ధరలను పోసి కొనుగోలు చేయడం మాత్రం మధ్యతరగతి ప్రజలకు సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అందుకే అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. కొనుగోళ్లు మందగించడంతో తమ వ్యాపారులు దారుణంగా పడిపోయాయని, కనీసం దుకాణాల నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదని కార్పొరేట్ యజమానులు చెబుతున్నారు. ఎన్ని ఆఫర్లు ప్రకటించినా కొనుగోలు దారులు ఇటువైపు చూడటం లేదు.
స్వల్పంగా పెరిగి...
బంగారం, వెండి ధరలకు ఎప్పుడూ డిమాండ్ అధికంగానే ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైం రికార్డులను అధిగమించింది. సీజన్ అనుకున్నప్పటికీ ఇంత భారీ స్థాయిలో గతంలో ఎన్నడూ ఇంతలా ధరలు పెరగలేదని వ్యాపారులు కూడా చెబుతున్నారు. ధరలు పెరుగుదలతో వ్యాపారులు కూడా కొంత డీలా పడ్డారు. నేడు దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరల్లో కూడా కొద్దిగా పెరుగుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై వంద రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 90,760 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,010 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,11,100 రూపాయలకు చేరుకుంది.
Next Story