Tue Dec 16 2025 22:10:57 GMT+0000 (Coordinated Universal Time)
Gold Prices : పండగపూట కూడా పసిడి ధరలు ప్రశాంతంగా ఉండనివ్వవా?
దేశంలో ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అయితే స్వల్పంగానే పెరగడం కొంత గోల్డ్ లవర్స్ కు ఊరట అని చెప్పాలి.

బంగారం ఎప్పుడూ ప్రియమే. ప్రియమైన వస్తువు కావడంతో మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. తమ శరీరంపై ఉంటే చాలు అందానికి అందంతో పాటు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుందన్న భావనతోనే ఎక్కువ మంది బంగారాన్ని కొనేందుకు ఇష్టపడతారు. కష్టపడైనా సరే తులం బంగారం సొంతం చేసుకుంటే చాలు అని అనుకుంటారు. అయితే బంగారంలో తృప్తి అనేది ఉండదు. ఎప్పుడూ కొనాలనే అనిపిస్తుంటుంది. అందుకే బంగారానికి గిరాకీ ఎప్పుడూ పడిపోదు.
అభ్యంతరం లేకపోవడంతో....
స్టేటస్ సింబల్ గా మారడంతో పసిడిని కొనుగోలు చేయాలంటే అంతే స్థాయిలో డబ్బులు కూడా వెచ్చించాల్సి వస్తుంది. ఒకప్పుడు బంగారం కేవలం అలంకార వస్తువుగానే చూసేవాళ్లు. కానీ నేడు దానిని పెట్టుబడిగా కూడా చూస్తుండటంతో పసిడి ధరలు ఎప్పుుడూ పెరుగుతూనే ఉంటాయి. అయినా కొనుగోలుదారులు ఎవరూ లెక్క చేయడం లేదు. బంగారం కొనుక్కుంటే తమకు సేఫ్ అన్న నమ్మకం వారిలో పెరిగింది. కష్టసమయంలో ఆదుకునే వస్తువుగా మారడంతో బంగారాన్ని కొనుగోలు చేద్దామన్నా కుటుంబ సభ్యులు ఎవరూ పెద్దగా అభ్యంతరం చెప్పరు.
వెండి కూడా...
దేశంలో ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అయితే స్వల్పంగానే పెరగడం కొంత గోల్డ్ లవర్స్ కు ఊరట అని చెప్పాలి. పది గ్రాముల బంగారం ధరపై నూట డెబ్బయి రూపాయలు పెరిగింది. వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధరపై మూడు వందల రూపాయల వరకూ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 58,150 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 63,440 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర మాత్రం 76,800 రూపాయలుగా ట్రెండ్ అవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Next Story

