Fri Dec 05 2025 07:18:22 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rates Today : బంగారం రెండు లక్షలకు చేరుకుంటుందట.. ఇప్పుడే కొనుగోలు చేయడం బెటర్
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి

బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతుంటాయి. ధరలు తగ్గడం అనేది అస్సలు జరగదు. తగ్గినా కొద్దో గొప్పో తగ్గడం బంగారానికి ముఖ్యమైన అలవాటు. పెరిగినప్పుడు మాత్రం భారీగా పెరగడం సహజంగా భావించే పరిస్థితికి వచ్చింది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతన్నాయి. ఎంతగా అంటే దాదాపు నెలరోజుల పై నుంచి పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు దిగి రావడం లేదు. లక్ష రూపాయలకు పైగానే ఉంటుండటంతో వినియోగదారులు కూడా కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాది ఏంటో కానీ.. బంగారం కొనుగోలు చేయాలని భావించిన వారికి అచ్చిరావడం లేదు. జనవరి నుంచి ప్రారంభమైన ధరలు నేటి వరకూ పెరుగుతూనే ఉన్నాయి.
ఇంకా పెరుగుతాయని...
బంగారం విషయంలో ఇక ఆలోచించవద్దని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు తగ్గుతాయని ఆలోచించి వేచి చూడటం వృధా అని అంటున్నారు. ఎందుకంటే ఇంకా ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది జరగదని బిజినెస్ నిపుణులు కూడా చెబుతున్నారు. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, యుద్ధాలు, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు బంగారం ధరలు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ఇంకా ధరలు తగ్గుతాయని భావించి కొనుగోలు చేయకపోతే భవిష్యత్ లో అసలు కొనుగోలు చేయలేనంతగా ధరలు చేరుకుంటాయని అంటున్నారు.
స్థిరంగా బంగారం, వెండి ధరలు...
బంగారం విషయంలో అశ్రద్ధ అనవసరం.. కొందరు బంగారాన్ని పెట్టుబడిగా చూస్తూ కొనుగోలు చేసేవారు. ఒకనాడు అలంకారంగా భావించే బంగారం నేడు సంపదకు కేరాఫ్ గా మారింది. అందుకే బంగారం విషయంలో ఆలోచించవద్దని, ధరలను చూసి కొనుగోలు చేయకుండా ఉండవద్దని పది గ్రాముల బంగారం రెండు లక్షలకు చేరుకుంటుందని అంటున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,05,840 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,15,470 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,58,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఈ ధరలు మధ్యాహ్నానికి మార్పులు ఉండవచ్చు.
Next Story

