Fri Dec 05 2025 15:21:20 GMT+0000 (Coordinated Universal Time)
Gold Rates Today : బ్యాడ్ లక్.. ఈరోజు కూడా ధరలు పెరిగాయి.. నేటి బంగారం ధరలెంతంటే?
ఈ రోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరలు కొంత మేరకు తగ్గాయి.

పుత్తడి ధరల పెరుగుదల ఆగడం లేదు. గత కొన్ని రోజులుగా ధరలు కొద్దిగానైనా పెరుగుతూనే ఉన్నాయి. అసలే ధరల మోతతో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు వెనకాడుతున్న వినియోగదారులకు వరసగా ధరలు పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తుంది. కొనుగోలుదారుల్లో ధరల పెరుగుదల ఎంత ఆందోళన ఉందో అంతకు రెట్టింపులో జ్యుయలరీ దుకాణాల యజమానుల్లో నెలకొంది. ధరల్లో స్థిరత్వం ఉంటే కొనుగోలుదారులు ముందుకు వస్తారని, కేవలం ఆభరణాలను కొనుగోలు చేసేవారు మాత్రమే కాకుండా పెట్టుబడి కోసం చూసే వారు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారని బంగారు దుకాణాల వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
కొనుగోళ్లు తగ్గి...
కానీ ధరలు మాత్రం గత కొద్ది రోజులుగా తగ్గడం లేదు. స్వల్పంగా పెరిగినప్పటికీ ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేవారికి ఇది భారంగా ఉండటంతో కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నప్పటికీ బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. నిజంగా ఇది ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే అంతర్జాతీయ ధరల్లో ఒడిదుడుకులు, ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, యుద్ధాల వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
స్వల్పంగా పెరిగి...
ఇక రానున్నది పెళ్లిళ్ల సీజన్ తో పాటు పండగల సీజన్ కూడా కావడంతో బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు బులియన్ మార్కెట్ లో ఊపందుకుంటున్నాయి. అయితే ఎంత మేరకు పెరిగితే అంత కొనుగోళ్లు తగ్గే అవకాశాలు కూడా పుష్కలంగానే కనిపిస్తున్నాయి. ఈ రోజు దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరలు కొంత మేరకు తగ్గాయి. హైదరాబద్ బులియన్ మార్కెట్ లో ఉదయం నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 94,710 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,03,320 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర 1,29,800 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. మధ్యాహ్నానికి బంగారం, వెండి ధరల్లో మార్పులు రావచ్చు.
Next Story

